Friends · Telugu

సుధా దీపిక

Completed | Part 5 of 7 | 0 Likes

Part 5

సావిత్రమ్మ మాటలు దీపిక కి కొంచెం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, ఆలోచనను కలిగించాయి. ఒక్క క్షణం ఆగి మా అమ్మని అడగాలి. అంది. సావిత్రమ్మ ఎప్పుడో ఎందుకు? ఇప్పుడే అడుగుదాం. అని చెప్పింది. సుధ అప్పుడు డాన్సు క్లాస్ కి వెళ్ళింది. అందుకని సావిత్రమ్మ, దీపిక కార్లో బయల్దేరి దీపిక వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంట్లో అనసూయమ్మ దీపిక తల్లి ఊరగాయలు పెడుతోంది. కొద్ది పాటి మొత్తం లో ఊరగాయలు పెట్టి తెలిసిన ఇళ్ళల్లో కొంచెం లాభానికి అమ్ముతూ ఉంటుంది.
సావిత్రమ్మను చూడగానే పెరట్లోకి వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చింది. ముగ్గురు కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాకా సావిత్రమ్మ దీపికను ఎంతో పొగిడింది. అనసూయమ్మ సుధని గురించి చెప్పి మొదట విడ్డూరంగా అనిపించింది కానీ అక్కయ్య గారు ఆ పసి మనసు లో బలీయం గా ఆడతనం ఉన్నప్పుడు మనం ప్రోత్సాహం ఇవ్వడం సబబే. దీపు నాకు ప్రతి రోజూ జరిగిన విషయాలన్నీ చెబుతూంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సుధకి ఇప్పుడు ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నారట కదా! త్వరలో మనలా పూర్తి గా ఆడతనాన్ని పొందుతుంది. ఆ మధ్య సుధ మాఇంటికి వచ్చింది. ఎంతో పొందికైన పిల్ల. దీపు, సుధా అక్కాచెల్లెళ్ళు లాగా అనిపిస్తుంది నాకు. అంది అనసూయ.
బాగా చెప్పారు చెల్లెమ్మా. వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్ళు. మనిద్దరం అక్కా చెల్లెళ్ళు. మనం నలుగురం ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు కదా!? నాకు, మీకు కూడా ఇద్దరు కూతుళ్లు. అని చెప్పింది సావిత్రమ్మ చాలా సహజంగా. అనసూయమ్మ ఊహించని ఆ మాటలకు ఒక్క సారి ఆశ్చర్యపోయింది. "అవుననుకోండి అక్కయ్య గారు.. మీ ఆర్థిక స్తోమత వేరు. మా ఆర్థిక స్తోమత వేరు. అలాగే సామాజికంగా కూడా మీకు, మాకు తూగుతుందో లేదో.... " అంది. వెంటనే ఆమె రెండు చేతులు పట్టుకుని మీరింకేం మాట్లాడొద్దు. మీరు మనింటికి వచ్చెయ్యండి. దీపిక నాకు పెద్ద కూతురు. ఆమె ఆలనా పాలనా అంతా నేను చూసుకుంటాను. అని తనకున్న పథకాలన్నీ వివరంగా చెప్పింది సావిత్రమ్మ . ఆతరువాత వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఒక మంచిరోజు చూసి దీపిక, అనసూయమ్మ సావిత్రమ్మ వాళ్ల ఇంటికి మారిపోయారు.
అప్పటి నుంచి అనసూయమ్మ సుధకి వంటలు వండటంలో, ఊరగాయలు పెట్టడం, అప్పడాలు, వడియాలు తయారు చేయటం, కారప్పొడి, కొబ్బరి పొడి, కంది పొడి వంటివి చేయటం ఇవన్నీ నేర్పసాగింది. అలాగే బ్యూటిషియన్ టెక్నిక్స్ కూడా నేర్పసాగింది. అనసూయమ్మ దీపిక చిన్న పిల్లగా ఉండగా ఒక బ్యూటిషియన్ దగ్గర మూడేళ్ళు పనిచేసింది. ఆ అనుభవాన్ని ఇప్పుడు సుధకి నేర్పడంలో చూపెడుతోంది. అలాగే సుధపై నెమ్మదిగా HRT treatment ప్రభావం మొదలైంది.
ముందుగా మొదటి మూడు నెలల్లో,..
సుధ మానసిక స్థితిలో ఎన్నో మార్పులు మొదలయ్యాయి. తను ఒకప్పుడు మగ వాని గా ఉండేది అనే భావనే లేదు.
తను పక్కాగా ఆడపిల్లనే అనే దృఢమైన నమ్మకం పెరుగుతోంది.
అంతకు మునుపు 45 కిలోలు ఉండేది కాస్తా 48 కి పెరిగింది. అంది చూసి అనసూయమ్మ ఇదిగో పిల్లా, ఆడపిల్లలు పెళ్ళైతేకాని బరువు పెరగకూడదమ్మా. రోజూ మరో పావుగంట వ్యాయామం ఎక్కువగా చెయ్యి అంటూ దగ్గర ఉండి వ్యాయామం చేయించటం మొదలు పెట్టింది. ఇదంతా చూస్తున్న సావిత్రమ్మ కి ఎంతో ఆనందం కలిగింది.
చర్మం చాలా నాజూకుగా సిల్క్ లాగా జారుతున్నట్టు ఉంది.
అకస్మాత్తుగా వంట్లోంచి వేడి ఆవిర్లు రావటం, అంతలోనే చలి పుట్టటం, చెమట పట్టడం, హార్ట్ బీట్ పెరగడం వంటి హాట్ హాట్ ఫ్లాష్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
తీసుకుంటున్న ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ మందుల వల్ల
3-6 నెలల్లో
సుధ వక్షోజాలు పెరగడం మొదలైంది. చెరువులో రెండు తామరమొగ్గల్లాగా ముందుకు పొడుచుకొని వస్తున్నాయి. చను మొనలు పెరుగుతున్నాయి. పరికిణీ, జాకెట్టు వేసుకుంటే గుబ్బలు ఉబ్బుతూ, క్లీవేజ్ కనబడుతోంది.
అలాగే నడుం దగ్గర పేరుకున్న కొవ్వు బాహు మూలల్లో,
పిరుదులు, కాళ్ళు, చేతుల్లోకి  పంపిణీ అవుతోంది..
దేహం లో కండరాలు మృదువుగా మారుతున్నాయి.
కంఠస్వరం  మృదువుగా మారింది.
6-12 నెలల కాలంలో...
ఛాతీ పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉంది.కొవ్వు పంపిణీ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చర్మం మరింత మృదువుగా, సున్నితంగా మారింది.
శరీరంలో అక్కర్లేని చోట జుట్టు తగ్గిపోయింది. ఇలా మరో ఆరుమాసాలు గడిచేసరికి SRT కి అనుగుణంగా శరీరం లో అన్ని మార్పులూ చోటు చేసుకున్నాయి.

2051 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login