సుధ HRT treatment విషయం లో ఎప్పటికప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో వస్తున్న మార్పులు అన్నీ గమనిస్తున్నారు.
ఛాతీ పెరుగుదల పూర్తి అవుతోంది. తగినంత స్ఫుటత్వానికి చేరుకున్నాయి వక్షోజాలు. సుధకి మొదట కొన్న దుస్తులు చాలా బిగుతుగా తయారయ్యాయి. ఇప్పుడు ఎక్కువగా చుడీదార్ లు, పరికిణీ జాకెట్టు, ఓణీలు ఎక్కువగా కొంటున్నారు. లోపల బ్రా 34B సైజ్ సరిగ్గా ఉంది. సుధకి సిగ్గులు మొదలయ్యాయి. లంగా ఓణీ వేసుకున్నాకా ప్రతి అయిదు నిమిషాలకి ఒకసారి ఓణీ సద్దుకుంటోంది. అది చూసి ఇంట్లో మిగిలిన ముగ్గురు ఆడవాళ్ళు ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. వాళ్ళ నవ్వులు చూసి సుధ బుంగ మూతి పెడుతోంది. నెమ్మదిగా తన శారీరక, మానసిక
పరిణామాలకి అలవాటు పడింది.
ఇప్పుడు ఆమె శరీర ఆకారం మరింత స్పష్టమైన స్త్రీత్వాన్ని పొందింది. శరీరకండరాలు స్త్రీ సహజమైన రీతిలో చాలా మృదువుగా పరిణమించాయి. స్వరం ఎంతో మృదువుగా మారింది. ఆమె సంగీతం నేర్చుకోవడం వల్ల కూడా ఆ సహజత వచ్చింది. ఆమె గొంతు శ్రుతి, స్వభావంలో మార్పులు వచ్చాయి ఆమె సంగీతంలో కొత్త శైలి, భావప్రకటన ఉంది. ఆమె మధ్యమ, తార శ్రుతులలో చక్కగా పాడుతోంది. గొంతు మృదువుగా, సున్నితంగా, భావప్రకటనకు అనువుగా ఉంది. భావప్రకటనలో సున్నితత్వం, మాదుర్యం, భక్తి భావం ఎక్కువ గా చోటు చేసుకుంటోంది.గమకాలు మృదువుగా, సున్నితంగా, అందంగా ఉన్నాయి.
ఇలా ఆమెకు 19 సంవత్సరాల వయస్సు వచ్చింది.
ఇప్పుడు ఆ ఇంట్లో నలుగురు ఏ అరమరికలు లేని స్త్రీలే. సుధ ఒకప్పుడు సుధాకర్ అంటే ఎవ్వరూ నమ్మే వారు లేరు. చుట్టు పక్కల వాళ్ళుకూడా సుధని, దీపికను, పండగలకి, ఫంక్షన్ లకీ పిలుస్తున్నారు.
ఒకసారి వాళ్ళు నలుగురు సమావేశం అయ్యారు. ఇప్పుడు సుధకి HRT treatment పూర్తి అయ్యింది అని డాక్టర్లు చెబుతున్నారు.
డాక్టర్లు
ఇంక SRS సెక్స్ రిఅసైన్మెంట్ సర్జరీలో
*వాగినోప్లాస్టీ* ఒక భాగం ఇది స్త్రీ జననేంద్రియాలను సృష్టించే ప్రక్రియ,
*వల్వోప్లాస్టీ:* స్త్రీ జననేంద్రియాల బయట భాగం సృష్టి.
*క్లిటోరోప్లాస్టీ:* క్లిటోరిస్ సృష్టి.
ఈ మూడింటికి 3-నుంచి 6:మాసాల కాలం పడుతుంది. అవసరమైతే చేయించుకోవచ్చు. అని చెప్పారు.
కనుక ఇంక SRS కి వెళ్ళాలా వద్దా? అని నలుగురు చర్చించుకుంటున్నారు.
సుధ SRS కి మానసికంగా సిద్ధం అయ్యింది.
Discussion (0)