విరజ, నీరజ కవలలు. చిన్న తనం నుంచి విరజ కోరుకున్న ప్రతి వస్తువును నీరజ సొంతం చేసుకోవడం అలవాటు చేసుకుంది. విరజకి ఎప్పుడూ నీరజని గెలిపించటమే ఇష్టం. అక్క చెల్లెళ్లు ఇద్దరూ యుక్తవయస్సు కు వచ్చాకా విరజకి సోంబాబు తో పెళ్ళి చేసారు. సోంబాబు కృష్ణాజిల్లాలో ఉన్న ఒక గ్రామంలో పెద్ద మోతుబరి రైతు. అతనికి చుట్టు పక్కల పది గ్రామాల్లో షుమారు నాలుగు వందల ఎకరాల భూమి ఉంది. పెళ్ళైన మూడోరోజే నీరజ విరజతో "బావ చాలా బాగున్నాడక్కా". అంది.
"అన్నీ పంచుకోగలం కానీ మొగుణ్ణి పంచుకోవటం ఎలాగే నీరూ?" అని అడిగింది విరజ.
"నువ్వు ఊ అనక్కా. నేను పెళ్లికి రెడీ". అంది. మరి సోంబాబు ఆస్తిపరుడాయె.
విరజ సోంబాబుకి నీరజ ఆలోచన చెప్పింది. కానీ సోంబాబు ఒప్పుకోలేదు.
అప్పటి నుంచి విరజమనస్సు లో ఆ సమస్య దొర్లుతూనే ఉంది. విరజ గర్భవతి అయింది. నీరజ అసూయ పెరిగింది.
తొమ్మిదవ నెల చివరిలో ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. నీరజ అసూయ తో రగిలి పోయింది. ఎలాగైనా అక్క అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఎవరో మంత్రసానిని కలిసి అక్క చనిపోయేందుకు స్లో పాయిజన్ మందు తీసుకుని అక్క చేత తాగించింది. విరజకి ఈ విషయం తను చనిపోయే ముందు రోజు తెలిసింది.
వెంటనే సోంబాబుని, నీరజని రమ్మంది. "ఏమయ్యా! నాలో కోరిక. నేను ఇంక బ్రతకను. కొన్ని గంటల్లో చనిపోతాను.
ఇప్పటికే నేను చాలా అనారోగ్యం లో ఉన్నాను. నాకు తెలుసు నేను ఇంక బ్రతకను అని." అంది. ఆమాట విని నీరజ గతుక్కుమంది.
"అదేంటి విరజ? నేను నిన్ను పట్టణానికి తీసుకుని వెళ్లి చికిత్స చేయిస్తాను" అన్నాడు సోంబాబు. అంతటైం లేదంటూ "నా బిడ్డకు తల్లి లేని లోటుండకూడదు. కనుక నేనుండగానే నువ్వు నా చెల్లి నీరజని పెళ్ళి చేసుకో." నీరజకి లోపల సంతోషంగా ఉంది. కానీ పైకి చాలా బాధపడుతున్నట్టు నటించింది. సోంబాబు ని విజ ఒప్పించింది. ఇంటి పురోహితుణ్ణి పిలిపించింది. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించింది. తరువాత రెండు గంటల్లో విరజ
మరణించింది.
తనకోసం త్యాగం చేసిన అక్క అంటే నీరజకి నిజంగా కూడా ఎక్కడో బాధ కలిగింది. అయినా అది తన కోరిక నెరవేరటంతో అంతగా బయటపడలేదు.
తన అక్క బిడ్డ మెగా పిల్లవాడైనా వాడిలో తన అక్కని చూసుకుంటాను అంటూ ఆ బిడ్డను ఆడపిల్ల లాగా పెంచటం మొదలు పెట్టింది.
Family · Telugu
సవతి కూతురు
Completed
|
Part 1 of 5
|
0 Likes
Part 1
2288 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
@gvgarima Akka, oka ammayi andanni entha baga evaru varninchaleremo.
మీకు ఇంతబాగా నచ్చినందుకు చాలా థాంక్స్ చెల్లి.