Family · Telugu

సవతి కూతురు

Completed | Part 2 of 5 | 0 Likes

Part 2

ఒక సంవత్సరం తర్వాత నీరజకు కూడా ఒక మగబిడ్డ పుట్టాడు. ఆమె సొంత కుమారుణ్ణి అబ్బాయిలా, అక్క కుమారుణ్ణి అమ్మాయిలా పెంచుతోంది. విరజ అనే పేరు పెట్టింది.
సోంబాబు కూడా అంతగా పట్టించుకోలేదు. ఏదో అక్క మీద ప్రేమతో అలా పెంచుతోంది అని సరిపెట్టుకున్నాడు. రోజులు నెలలు, నెలలు సంవత్సరాలు అయ్యాయి. అలా పదేళ్ళు గడిచాయి.
ఎవరైనా అదేంటమ్మా. ఇప్పటికైనా మగపిల్లాడి లా పెంచమంటే ఆ రోజంతా ఇంక రాకాసి లోయే. విరజ ని కౌగలించుకుని నా అక్కని నానుంచి దూరంచేసేస్తున్నారర్రో.... అంటూ గగ్గోలు పెట్టి ఏడుస్తుంది నీరజ. ఇదంతా చూస్తున్న విరజ పిన్నికి మా అమ్మ అంటే ఎంత ప్రేమో. అనుకుంటూ "పిన్నీ! నేను నీకోసం ఆడపిల్లగానే పెరుగుతా." అని మాటిచ్చింది. "మా తల్లే... మా బంగారే... నేను నీ పిన్నిని కాదే. నీ అమ్మనే. ఏదీ అమ్మ... అని పిలు.... పిలు" అని అమ్మా అని పిలిపించుకుంది.
సోంబాబు తో చెప్పి చెప్పి చివరికి విజయవాడకి మకాం మార్పించింది. విరజని ఆడపిల్లల స్కూల్లో చేరిపించింది.
విరజని నెమ్మదిగా నెమ్మదిగా తన చిన్న నాటి స్నేహితురాలు నీలిమ డాక్టరై విజయవాడలో గైనకాలజిస్ట్ గా ప్రాక్టీస్ పెట్టింది అని తెలుసుకుని ఆమె దగ్గరకి తరచు వెడుతూ తనతో పాటు విరజను కూడా తీసుకుని వెళ్లి తనకు తానే అక్క అంటే ఎంతో ప్రేమ అని అందుకే అక్క బిడ్డను ఆడపిల్లగా పెంచుతున్నానని వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతూండేది. దానికి కరిగి పోయి నీలిమ ఎందుకైనా మంచిదని విరజని విడిగా పిలిచింది. నీరజ విషయం లో విరజ అభిప్రాయం ఏమిటో తెలుసుకుంది.
అలా మరి మూడేళ్ళు గడిచాయి. విరజకి 13 ఏళ్ళు నిండాయి. అప్పుడు నీరజతో నీలిమ "ఇప్పుడు విరజ బాల్యం నుంచి యౌవనం లోకి మారుతున్న సమయం. ఇప్పుడు మగతనపు ఛాయలు స్ఫుటంగా కనిపిస్తాయి. కనుక ఇప్పుడు ప్యూబెర్టీ బ్లాకర్స్ వాడాలి. అలా వాడితే

1. పురుష సహజమైన *బాడీ హెయిర్ పెరగదు*
2. మేల్వాయిస్ గా ఛేంజ్ ఉండదు.
3. *అకడమిక్ గ్రోత్ ఆగుతుంది* పురుషుల హార్మోన్ లు గణనీయంగా తగ్గుతాయి.
4. *స్కిన్ ఆయిలీనెస్ తగ్గుతుంది*
5. *మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి*‌
6. *మేల్ సెక్సువల్ డెవలప్‌మెంట్ ఆగిపోతుంది*
అని చెప్పింది నీలిమ. నీరజ తలూపింది. తల్లితో వచ్చిన విరజ అలా వాడటానికి ఒప్పుకుంది.

2284 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 4 months, 3 weeks ago

@gvgarima Akka, oka ammayi andanni entha baga evaru varninchaleremo.

gvgarima
gvgarima Author 4 months, 3 weeks ago

మీకు ఇంతబాగా నచ్చినందుకు చాలా థాంక్స్ చెల్లి.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login