జానకమ్మ కు ఇప్పుడు సురేఖ లేని లోటును సుమ తీరుస్తోంది. నెమ్మదిగా సుమ వ్రతాలతో ఆగిపోకుండా సేవికలందరితో కలిసి ఇంటి పనులు నేర్చుకోవటం మొదలు పెట్టింది. పూలు మాలకట్టటం, వంటలు చెయ్యటం, ఇల్లు శుభ్రం చెయ్యడం, ఇల్లు చక్కగా సర్దుకోవడం, బట్టలు ఉతకటం, అల్లికలు, కుట్లు అన్నీ నేర్చుకుంటోంది.
"సుమ, పెరటిలో పూలు కోసుకురా. పూలతో దండలు కట్టు". అని అమ్మ ఆజ్ఞ. అప్పటికే సుమ పూల మాలలను అల్లటం సేవికలలో కుమారి దగ్గర నేర్చుకుంది. కుమారి పలువిధాలుగా పూలమాలలు కట్టటం లో నిపుణురాలు. ఆమెకు సొంతంగా పూల అంగడి కూడా ఉంది. అలా అమ్మ చెప్పటం ఏమిటి సుమ దండలు సిద్ధం చేసేది.
"చూడు సుమ! వంటింట్లో, పూజగదిలో జుట్టు విరబోసుకుని రాకూడదు. జడ వేసుకుని రా." అని అమ్మ చెప్పటం ఏమిటి... తను సేవికలలో నిర్మల దగ్గర నుండి వేసుకోవటం, కొప్పు కట్టుకోవటం, ముడి వేసుకోవటం, పోనీ టెయిల్ కట్టుకోవటం నేర్చుకుని ఉండటం వల్ల వెంటనే రెండు నిమిషాలలో జడ వేసుకునేది. నళిని తమిళనాడు నుంచి వచ్చిన వంటలక్క. ఆమె దగ్గర తమిళ వంటలన్నీ నేర్చుకుంది. దీపిక కర్ణాటక నుంచి వచ్చిన వంటామె. అయితే ఆమెకు ఆంధ్ర వంటలన్నీ బాగా వచ్చు. అందుకని ఆంధ్ర వంటలు, కొన్ని కర్ణాటక వంటలు ఆమె దగ్గర నేర్చుకుంది. అలాగే కుమారి దగ్గరే కుట్లు, అల్లికలు బాగా నేర్చుకుంది. నేర్చుకునే రోజుల్లో పూలు మాలకోసం దారం తో కట్టేటప్పుడు పూలు నలిగి పోయేవి. అప్పుడు ఆడపిల్ల అంటే ఎంత సున్నితంగా ఉండాలో తెలియవచ్చింది. షుమారు పదిహేను, ఇరవై రోజులు ప్రాక్టీస్ చేస్తే కానీ మాల కట్టేటప్పుడు పూలను ఎంత సున్నితంగా పట్టుకోవాలో నేర్చుకుంది. సేవికలు ఉన్నా తన బట్టలు తానే ఉతుక్కోవటం నేర్చుకుంది. కుట్లు, అల్లికలు కూడా ఒక నెలరోజుల్లో కొంత వరకు పట్టు సాధించుకుంది. వాళ్ళంతా పనివాళ్ళే అయినా వాళ్లకున్న పనితనం తో వాళ్ళు సుమకు దగ్గరయ్యారు. జానకమ్మ నిర్వహణలో దేవుళ్ళని తోమటం, వ్రతాలని బట్టి అలంకరించటం నేర్చుకుంది. సుమకు నెమ్మదిగా తన ఆడతనం మీద ఆసక్తి, ఇష్టం, శ్రద్ధ, ఒక ఆకర్షణ పెరుగుతున్నాయి. తాను కాలేజీకి వెళ్ళేటప్పుడు మగ వేషం లో వెళ్ళాలి కాబట్టి ఎంతో కష్టం మీద జీన్స్ పాంట్, టి షర్ట్ వేసుకుని వేడుతోంది. అతి కష్టం మీద క్లాస్ లో ఎలాగో గడిపి ఇంటికి వచ్చేస్తోంది. ఇంటికి రాగానే లంగా, ఓణి లోకో, చూడిదార్ లోకో, టైమ్ ను బట్టి నైటీ లోకో మారిపోతోంది. ఆ దుస్తులు ఆమెకు సుఖంగా ఉన్నాయి. అలాగే తను అద్దం ముందు ఎక్కువ సేపు గడుపుతోంది. జానకమ్మ ఇదంతా గమనిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది. సుమకి చాప ఫంక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. అమ్మ పెట్టిన తిండికి కొద్దిగా గుండ్రంగా తయారయ్యింది సుమ. జానకమ్మ ఈ రెండేళ్లలో ఒంటికి పసుపు బాగా పట్టించటం, నలుగు పిండి తో, కుంకుడు కాయలతో అభ్యంగ స్నానం చేయించటం ఇవన్నీ సుమ అందాన్ని ఇనుమడింప చేశాయి.
సుమ తను అందంగా కనబడటం కోసం ఎంతో శ్రద్ధ తీసు కుంటోంది. జానకమ్మ చాప ఫంక్షన్ గురించి రఘురామ్ కి చెప్పింది. ఒక్క సారి ఉలిక్కి పడ్డాడు . ఇది సమయం కాదు అనిపించింది అతనికి. ఇంచు మించుగా రఘురాం సర్కిల్స్ లో అందరికీ సుమ అతని రెండవ కూతురే అనే అభిప్రాయం ఉంది. కానీ చుట్టాలలో మాత్రం ఈ విషయం ప్రచారం లోకి రాకుండా చూసుకున్నాడు. అందుకని జానకమ్మ తో ఏకాంతం లో ఇలా చెప్పాడు. “జానకి! నీకు నాకు తను సుమనేది ఖాయం. కానీ చుట్టాలలో ఈ విషయం ఇంకా బయటపడలేదు. కనుక మనం ప్రస్తుతం ఇలానే నిశ్శబ్దం గా ఉందాం. నీ పర్యవేక్షణ లో సుమ నోములు, వ్రతాలలో ఎన్ సైక్లో పెడియా లా ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియేట్ పరీక్షలు వ్రాయనీ. నెమ్మదిగా సర్టిఫికెట్ లో జెండర్ మార్పించి గర్ల్స్ కాలేజ్ లో చేరిపిద్దాం డిగ్రీలో. అన్నాడు. జానకమ్మ కొద్ది నిమిషాలు ఆలోచించి సరేనంది. తన భర్త దారే తన దారి ఈ విషయంలో అనుకుంది. సుమను రఘురామ్ పిలిచి జాగ్రత్తగా ఇంటర్ పరీక్షలు వ్రాయమన్నాడు. చెవి జూకాలు కదిలేలా సుమ తలూపింది. తరువాత డిగ్రీ కి వుమెన్స్ కాలేజీలో చేరుదుగానీ అని చెప్పాడు. ఇంక సుమ ఆనందానికి హద్దులు లేవు. “నాన్నా, మీతో ఒక విషయం చెప్పాలి.” అంది. రఘురాం ఏమిటన్నట్లు చూశాడు, నేను అమ్మకోసమే స్త్రీగా వ్యవహరించటం మొదలు పెట్టినా నెమ్మది గా నెమ్మది గా నాకు ఈ స్త్రీ జీవితమే చాలా బాగుంది. నేను ఎప్పటికీ స్త్రీ గానే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది ఈ దుస్తులమీదనో, ఈ ఆకారం మీదనో మోజు తో కాదు. మనింటిలో ఉండే సేవికల పట్ల నాకు ఏ మాత్రం మోహం లేదు. వాళ్ళంతా అందగత్తెలే. అయినా వాళ్ళ స్పర్శ నాకు సాటి స్త్రీల స్పర్శలాగే ఉంది. ఇంతలో మీరు కూడా నన్ను గర్ల్స్ కాలేజీ లో చేర్చుతాననటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మీ తదుపరి నిర్ణయం అనుసరిస్తాను. అమ్మ ఇప్పటికీ తన డిప్రెషన్ నుంచి బయటకు వస్తూంది. ఏం చేద్దామో చెప్పండి.” అని అడిగింది. రఘురామ్ జానకమ్మ మనసే కాదు. సుమ మనస్సును కూడా పరిశీలిస్తున్నాడు. సుమ చాలా సహజమైన ఆడపిల్లగా మారుతోంది. ఇప్పుడు కూడా తనకు కావాల్సిన విషయం ఆడపిల్లలాగే చెప్పింది. కనుక ఇప్పుడు ఏమాత్రం మరో రకమైన నిర్ణయం తీసుకున్నా అటు జానకీ, ఇటు సుమ ఇద్దరూ ప్రమాదం లోకి వెడతారు. అనుకుని ఒక నిశ్చయానికి వచ్చి “సుమ, మనం తీసుకోబోయే నిర్ణయానికి ఇంకా సమయం ఉంది. కనుక ఈ లోపు నువ్వు ముందు ప్రస్తుతం ఎలా ఉంటున్నావో అలాగే ఉంటూ పరీక్షలు వ్రాయి. తరువాత అందరికీ సమ్మతమైన రీతిలోనే ముందుకు వెడదాం” , అన్నాడు.. సుమకి కూడా నాన్న హృదయం బాగానే అర్థం అయ్యింది. తాను అమ్మకి చేదోడు వాదోడు గా ఉంటూనే తన పరీక్షలకు సిద్ధం అయ్యింది, పరీక్షలు బాగా వ్రాసింది. రిసల్ట్స్ వచ్చే లోగా రఘురాం చెల్లెలు సర్వమంగళ నుంచి ఫోన్ వచ్చింది. తన కూతురు కూడా రఘురామ్ ఇంట్లోనే ఉంటూ తన ఫైవ్ యీయర్స్ సైకాలజీ integrated కోర్సు చేద్దామను కుంటోంది అని. అలాగే అన్నాడు రఘు. మంగళ కూతురు రాగిణి ఆ మరుసటి రోజు తన సూట్ కేసు తో మావయ్య ఇంటికి వచ్చింది.
Part 2
3923 Views
7 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (7)
Akka, nak enduko 6 va bhagam lo doctor mariyu suma madhyana jarige sambhashana baga nachhindi.. Chala ardam vachhedattu vrasaru. Malli.. Malli chaduvuta.. Edo jeevaitha niki oopayoga padey matalu chala vunnai.. Thanks akka intha manchiga vrasinanduku
gvgarima akka, meeru rasina kadalu chaduvutuntey edo yendakalam taravatha tolakari jalluki tadisina matti vasana laga, alage tellavarujamuna amma echhey filter coffee suvasana laga..edo teliyani anandam vuntundi..marinni stories rayandi..maa andarini anandimpa cheyandi. Thanks akka.
ధన్యవాదాలు చెల్లి మేఘన గారు మీకు
ఈ రోజు అతిముఖ్యమైన మరి రెండు పార్ట్స్ జోడించాను
Chelli, Meghana Garu, with this 10th episode ఆడమనసు is completed. Just one thing is remaining. That is your translation of this second part which is richer than the original is awaited. Thanks for every thing Chelli.
Beautiful~~~ 😌, my favourite anime is Hyouka, your stories provide the same kind of calm and soothing vibes, ma'am, albeit the different genres and stories.
Thank you Jerujoy. I am obliged 🌺🌹 💕