ఇంతలో యు యస్ లో సురేఖకు ఏదో గట్టి సమస్య వచ్చింది. తండ్రికి, తల్లి కి ఫోన్ చేసి ముందు వాళ్ళు ఎలా ఉన్నారు, సుమన్త్ సుమగా మారటం, రాగిణి కూడా ఇక్కడే ఉంటోంది అన్న విషయాలు తెలుసుకుంది. తరువాత తన కష్టాలను చెప్పటం మొదలు పెట్టింది. తల్లి జానకమ్మను, తండ్రి రఘురాం ను ఇద్దరినీ ఆన్ లైన్ లోకి తీసుకుని చెప్పటం మొదలు పెట్టింది. మేం ఇక్కడకు వచ్చిన మూడేళ్లలో కొత్తల్లో మా దాంపత్యం బాగానే ఉండేది. కానీ రాను రాను మా మధ్య ఎడం పెరుగుతోంది. మీ అల్లుడు సతీష్ కొంతమంది అమెరికన్ ల తోఫ్రండ్ షిప్ చేశాడు. వాళ్ళల్లో గేలు కూడా ఉన్నారు. అలాగే భార్యలను ఒకటి రెండు రోజుల పాటు మార్చుకునేవారు కూడా ఉన్నారు. నేను మొదట్లో వ్యతిరేకించాను. కానీ తనతో కలిసి ఉండాలి అంటే నేను తప్పకుండా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్క సారి లెస్బియన్ ల తో కూడా పడుకోవాల్సి వస్తోంది. ఈ జీవితానికి అలవాటు పడిన నాకు అక్కడికి రావటం ఇష్టం లేదు. పైగా నేను ఇటువంటి అలవాట్ల తరువాత మీ ముఖం కూడా చూడకుండా ఉండలేక పోతున్నాను. అయితే మా ఇద్దరి మధ్య ఈ మధ్య ఒక గొడవ మొదలైంది. నేను క్రిందటి సంవత్సరమే గర్భవతిని అయ్యాను. అప్పుడు సతీష్ తరచూ నన్ను సందేహించటం మొదలు పెట్టాడు.. మనిద్దరం కలిసి నాలుగు నెలల పైనే అయ్యింది. ఇప్పుడు నువ్వు గర్భవతివి అంటే నువ్వు ఛార్లస్ తో పడుకున్నందుకు గర్భవతివి అయ్యావా? లేక విల్లియమ్స్ వల్ల తల్లివి కాబోతున్నావా? అని అడిగాడు . నా దగ్గర సమాధానం లేదు. మొదట్లో ఆవేశపడినా తరువాత అతన్ని ఒప్పించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇలాంటి పరిణామం తనవల్లనే జరిగింది అని తనకి తెలుసు. అయినా పురుషాహంకారం. దేశం కానీ దేశం లో నేనేం చేయగలను అని ఒక నిర్లక్ష్యం. మగజాతిలో ఎక్కడ చూసినా చాలా మంది ఇలానే కనబడుతున్నారు. నెమ్మదిగా సతీష్ ఇంటికి రావటం తగ్గించాడు. అందునా పుట్టబోయే బిడ్డ ఆడ బిడ్డ అని తెల్సింది. వాకబు చేస్తే తెలిసింది. తను వేరే ఎక్కడో ఎవరితోనో కాపురం పెట్టాడని. అప్పుడప్పుడు వేడి దించుకోవటానికి, అవసరానికి వాడుకోవటానికి మాత్రమే వస్తున్నాడు. అంతే కాదు సింపతీ తో, పుట్టబోయేది తమ బిడ్డ అనే ప్రేమతో ఛార్లస్, విల్లియమ్స్ ఇద్దరూ కూడా రావటం మొదలు పెట్టారు. ఇక తప్పని సరై నేను వాళ్ళిద్దరినీ రానిస్తున్నాను. నాకు ఒక తొమ్మిది నెలల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆ తరువాత ఒకటి రెండు నెలలు ముగ్గురూ కూడా వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎవరెవరినో తీసుకు రావటం మొదలు పెట్టారు. ఎవరినీ కాదనగల స్థితి లేదు. తరువాత ఎందుకో ఛార్లస్ నాకు దగ్గర అయ్యాడు. తనతో నన్ను నియర్ బై విలేజ్ కి తీసుకుపోయాడు. ఒక ఫార్మహౌస్ లో నన్ను ఉంచాడు. నాకు ఇక పై ఎవరి వల్లా సమస్య ఉండదన్నాడు. నాకు ప్రాంతం లో ఇప్పుడే ఒక ఉద్యోగం కూడా దొరికింది. ఇలా నేను ప్రస్తుతం ఒక కొత్త జీవితానికి అలవాటు పడ్డాను. ఏ విధమైన లీగల్ ప్రమేయం లేకుండా సతీష్ నేను విడిపోయాం. ఎప్పుడైనా సతీష్ మిమ్మల్ని కలిస్తే మళ్ళీ వాడితో మాట్లాడకండి. నేనింక మీతో ఎప్పటికీ మాట్లాడలేను. మాట్లాడను కూడా. మీ పెద్ద కూతురు సురేఖ చనిపోయింది అనే అనుకోండి. నేను ఇంక ఈవిధమైన జీవితం లోంచి బయట పడలేను. సుమని ఒకసారి రమ్మని చెప్పండి. దానితో కొన్ని విషయాలు మాట్లాడాలి.” అని చెప్పింది. అ ప్రక్కనే ఉన్న సుమ వీడియో కాల్ లోకి వచ్చింది. ప్రక్కనే రాగిణి కూడా ఉంది. అప్పుడు సురేఖ వెక్కి వెక్కి ఏడుస్తూ “ఒసేవ్, సుమ, నువ్వు చాలా బాగా తయార్ అయ్యావే. ఇక పై అమ్మని, నాన్నని నువ్వే జాగ్రత్త గా చూసుకోవాలి. గతం లో నిన్ను నేను ఒక్కొసారైనా ఒరేయ్ సుమన్త్ అని పిలిచేదాన్ని. ఇప్పుడు మగ పేర్లు అన్నా, మగ గాలి అన్నా నేను భయం తో వణికిపోతున్నాను. ఇప్పటి వరకు అయితే నాన్ననీ, నిన్ను తప్ప మరెవర్నీ మగవాళ్ళని చూడాలంటే కంపరం గా ఉండేది. ఇప్పుడు నువ్వు కూడా ఆడపిల్ల గా మారుతున్నావు కనుక నాన్న తప్ప లోకంలో సేఫెస్ట్ మగ వాడు ప్రపంచం లో ఎవ్వరూ లేరు. నా జీవితానికి ఇంక నాన్నను, అమ్మను చూసే అవకాశం కూడా లేదు. నేను అవకాశం తీసుకోను కూడా. నీతో పాటు మన అత్త కూతురు రాగిణి కూడా ఇక్కడే ఉంటోంది అని తెలిసింది. మీరిద్దరూ జాగ్రత్త. అడ్వాన్స్డు మెడికల్ రిసెర్చ్ సహాయం తో నువ్వు పూర్తి గా ఆడపిల్లగా మారిపో. నువ్వు మగవాళ్ళని ఎవ్వరినీ నమ్మకు. చక్కగా జీవితంలో పైకి రా. నాన్నకి బిజినెస్ లో సహాయం చెయ్. రాగిణితో కూడా ఒసేవ్ రాగిణి, నిన్ను చిన్నప్పుడు చూశానే. ఇప్పుడు ఇక్కడ ఉండటం చాలా సంతోషం గా ఉంది. నేను అక్కడ లేకపోయినా మా అమ్మా, నాన్నలకి ఇప్పుడు ఇద్దరూ కూతుళ్ళు. నువ్వు, సుమ కూడా. నువ్వు మా అత్త కూతురువైనా మాకు తోబుట్టువుతో సమానమే. సుమకు ఈ జరగబోయే మెడికల్ ట్రీట్మెంట్ లో నువ్వు జాగ్రత్త గా తోడు ఉండు. అంది. సుమ, రాగిణి కన్నీళ్ళు పెట్టుకుంటూ తలలూపారు. రఘురాం చాలా భారంగా నిట్టూర్చారు. ఇంక నా ఉద్యోగానికి టైమ్ అవుతోంది. నేను బయల్దేరుతున్నాను. ఇంక మళ్ళీ మిమ్మల్ని ఎవ్వరినీ కలవను.” అని చెప్పి బావురుమంటూ ఏడుస్తూనే సురేఖ ఫోన్ కట్ చేసింది. ఈ మధ్య కాలంలో కొంచెం కొంచెం కోలుకున్న జానకమ్మ ఒక్కసారిగా మొదలు నరికిన చెట్టులా క్రింద పడిపోయింది.
Part 4
3925 Views
7 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (7)
Akka, nak enduko 6 va bhagam lo doctor mariyu suma madhyana jarige sambhashana baga nachhindi.. Chala ardam vachhedattu vrasaru. Malli.. Malli chaduvuta.. Edo jeevaitha niki oopayoga padey matalu chala vunnai.. Thanks akka intha manchiga vrasinanduku
gvgarima akka, meeru rasina kadalu chaduvutuntey edo yendakalam taravatha tolakari jalluki tadisina matti vasana laga, alage tellavarujamuna amma echhey filter coffee suvasana laga..edo teliyani anandam vuntundi..marinni stories rayandi..maa andarini anandimpa cheyandi. Thanks akka.
ధన్యవాదాలు చెల్లి మేఘన గారు మీకు
ఈ రోజు అతిముఖ్యమైన మరి రెండు పార్ట్స్ జోడించాను
Chelli, Meghana Garu, with this 10th episode ఆడమనసు is completed. Just one thing is remaining. That is your translation of this second part which is richer than the original is awaited. Thanks for every thing Chelli.
Beautiful~~~ 😌, my favourite anime is Hyouka, your stories provide the same kind of calm and soothing vibes, ma'am, albeit the different genres and stories.
Thank you Jerujoy. I am obliged 🌺🌹 💕