Family · Telugu

ఆడమనసు

ఆడమనసు Cover Image
Completed | Part 3 of 10 | 3 Likes

Part 3

రాగిణి వస్తూనే మావయ్య దగ్గరకు వచ్చి నమస్కరించింది. తరువాత జానకమ్మ దగ్గర కు వచ్చి నమస్కరించింది. తరువాత అత్తయ్యను కౌగలించుకొని దగ్గరకి తీసుకుంది. అత్తయ్య ప్రక్కన ఉన్న సుమను చూస్తూ కళ్ళతో అటు ఇటు వెతుకుతోంది. జానకమ్మ “ఎవరికోసం రాగిణి వెతుకుతున్నావు?” అని అడిగింది. “బావ ఎక్కడ అత్తయ్య? వాణ్ణి చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఇంట్లో లేడా అత్త?” అని అడిగింది. సుమ కొంచెం సిగ్గు పడుతూ కొంచెం ముఖం ప్రక్కకు తిప్పుకుని మళ్ళా ఏదో ఆలోచించి రాగిణి వైపు ఆసక్తి గా చూస్తోంది. ఇంతలో జానకమ్మ ఇక పై మనింట్లో బావ ఉండడమ్మా. నీకు చిన్న వదిన సుమ మాత్రమే ఉంటుంది.” అంది. అప్పుడు నిశితంగా సుమను చూస్తూ “వెరీ ఇంటరెస్టింగ్ .. వివరంగా చెప్పండి అత్తయ్యా” జరిగిన విషయం అంతా వివరించి చెప్పింది. విన్న వెంటనే చాలా ఆశ్చర్యం గానూ, ఆనందంగానూ సుమను కౌగలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టేసుకుంది. దానికింకా కావాల్సిన మార్పులు రాలేదే! జాగ్రత్త! రాగిణి!” అంది అత్తయ్య. రాగిణి పకపక నవ్వి “అత్త! సుమ మారిందనుకో మేమిద్దరం మంచి స్నేహితులం అవుతాం. అనుకున్న మార్పులు రాలేదనుకో బావే కదా. బావను నేనే పెళ్లి చేసుకుంటాను. అంటూ అంతకుముందే కుమారికి జానకి రాగిణి సామాన్లు సుమ గది ప్రక్కగదిలో పెట్టమంటే రాగిణి అడ్డు పడి “నో నో నా సామాన్లు సుమవదిన రూంలోనే పెట్టండి. మేమిద్దరం ఒకే రూమ్ లో ఉంటాం ” అంది. సుమకి చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు తనకు తన ఈడు పిల్ల తోడైంది. నా మనస్సు లోని భావాలను ఆమెతో చక్కగా పంచుకోవచ్చు.” అనుకుంది. సాయంత్రం వరకు గల గల మాట్లాడుతూ ఆ విషయాలు, ఈ విషయాలు మాట్లాడుతూనే సుమలో ఆడతనం ఎంతవరకూ ఉందో పరిశీలిస్తూంది. ఆశ్చర్యం గా సుమలో ఎంత వెదకినా మగ లక్షణాలు కనబడటం లేదు. ఆ దుస్తులు కట్టే తీరు, మాటల్లో మృదుత్వం, పూలదండలు కట్టే పద్ధతి ఇంక ఏ విషయం తీసుకున్నా సుమ పదహారు అణాల తెలుగు ఆడపిల్లలాగానే ఉంది. తొలి పరిచయం లోనే సుమ అంటే రాగిణికి ఎంతో ఇష్టం ఏర్పడింది. ఆ రోజు రాత్రి ఒంటిగంట వరకు చాలా చాలా కబుర్లు చెప్పుకున్నారు.
మరునాటి నుంచి సుమ, రాగిణి . జానకమ్మ తో కలిసి సాయంత్రం వేళల్లో ప్రవచనాలకు, భజనలకు, గుళ్ళకు తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళు డిగ్రీ కాలేజీ లో చేరటానికి మరో నెలరోజులు ఉంది. వీరు వెళ్ళిన చోటల్లా అక్కడ అంతా స్త్రీ ప్రపంచం మధ్యలోనే వారు కాలం అంతా గడుస్తోంది. నెమ్మదిగా జరుగవలసిన మెడికల్ ట్రీట్ మెంట్ విషయం లో రఘురాం కూడా ఒక స్థిరమైన నిశ్చయం తో సిద్ధమై ఆలోచిస్తున్నాడు.
ఇంతలో యు యస్ లో సురేఖకు ఏదో గట్టి సమస్య వచ్చింది. తండ్రికి, తల్లి కి ఫోన్ చేసి తన కష్టాలను చెప్పటం మొదలు పెట్టింది.

3922 Views 7 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (7)

Meghana
Meghana 1 month ago

Akka, nak enduko 6 va bhagam lo doctor mariyu suma madhyana jarige sambhashana baga nachhindi.. Chala ardam vachhedattu vrasaru. Malli.. Malli chaduvuta.. Edo jeevaitha niki oopayoga padey matalu chala vunnai.. Thanks akka intha manchiga vrasinanduku

Meghana
Meghana 1 month, 3 weeks ago

gvgarima akka, meeru rasina kadalu chaduvutuntey edo yendakalam taravatha tolakari jalluki tadisina matti vasana laga, alage tellavarujamuna amma echhey filter coffee suvasana laga..edo teliyani anandam vuntundi..marinni stories rayandi..maa andarini anandimpa cheyandi. Thanks akka.

gvgarima
gvgarima Author 1 month ago

ధన్యవాదాలు చెల్లి మేఘన గారు మీకు

gvgarima
gvgarima Author 1 month ago

ఈ రోజు అతిముఖ్యమైన మరి రెండు పార్ట్స్ జోడించాను

gvgarima
gvgarima Author 1 month ago

Chelli, Meghana Garu, with this 10th episode ఆడమనసు is completed. Just one thing is remaining. That is your translation of this second part which is richer than the original is awaited. Thanks for every thing Chelli.

JeruJoy
JeruJoy 2 months, 1 week ago

Beautiful~~~ 😌, my favourite anime is Hyouka, your stories provide the same kind of calm and soothing vibes, ma'am, albeit the different genres and stories.

gvgarima
gvgarima Author 2 months, 1 week ago

Thank you Jerujoy. I am obliged 🌺🌹 💕

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login