Family · Telugu

ఒక యువరాణి కథ

Completed | Part 1 of 9 | 0 Likes

Part 1

మా ఊరు విజయవాడ దగ్గర గన్నవరం. మా డాడీ స్టేట్ బ్యాంకు మేనేజర్.... అమ్మ హోం మేకర్ అంటే హౌస్ వైఫ్ అన్న మాట!! మా ప్రక్కింట్లో ఒక తహసిల్దార్ గారు ఉండేవారు.... వాళ్లకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ....... మా ఇంట్లో నేను మా అన్న దీపక్ మా అమ్మానాన్న ల సంతానం!! వాళ్ళ అబ్బాయి పేరు అశోక్ ,,, అమ్మాయి పేరు వైష్ణవి!! అమ్మకు నేను ఈ ఇంట్లోకి వచ్చిన తరువాతే పుట్టాను. అప్పుడు అమ్మ ఒకటే ఏడుపు అంట! మళ్ళీ మగ పిల్లాడేనా? అని. అప్పుడు అశోక్ వైష్ణవి ల అమ్మగారు చాలా ఓదార్చారట!! మనకు అమ్మాయి పుడితే వాళ్లకు మగాడి బట్టలు వేసి ఎలా పెంచుతామో అట్లానే నన్ను కూడా వైష్ణవి బట్టలు వేసి తయారు చేసి మురిసిపోయేవారట అమ్మ ఆంటీలు!! అట్లా నాకు ఊహ వచ్చే వరకూ వచ్చిన తరువాత కూడా జరిగింది. ఆ తరువాత కాల క్రమేణా నాన్న గారికి భయపడి అమ్మ నాకు ఆడపిల్లల బట్టలు తొడిగేది కాదు.... కానీ నాకేమో అట్లానే తయారు అవ్వాలని ఉండేది!! స్కూల్ లో ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లు ఏవైనా జరిగితే అమ్మను సతాయించేసే వాడిని(?) నా బాధ పడలేక అమ్మ ఒక పట్టు పావడా, ఓణీ కుట్టించి నాన్నకు తెలీకుండా అన్నయ్య లేనప్పుడు నన్ను ముస్తాబు చేసి ఆంటీ వైష్ణవి లను పిలిచి వాళ్లకు చూపించి మురిసి పోయేది..... అప్పుడప్పుడూ హిత బోధ చేసేది.... నువ్వు ఇంకా చెట్టంత మగాడివి అయిపోతున్నావు!! ఇట్లాంటివి మానెయ్యాలని. నాకేమో ఆడ పిల్లలా ఉండాలనే కోరిక రోజు రోజు కూ బలపడ సాగింది.... అట్లాంటి సమయంలో అమ్మ బీరువాలో ఈస్ట్రోజెన్ టాబ్లెట్స్ కనపడ్డాయి నాకు..... ఇవెందుకు వాడతారని వైష్ణవిని అడిగితే అవి "ఆడవాళ్ళకు సంబంధించినవి! నీకెందుకు అని ముసిముసినవ్వుల నవ్వింది!" అమ్మ తరచూ వేసుకోవటం చూసి ఆడవాళ్ళు వేసుకోవాలేమో అనుకుని నేను అమ్మకు తెలీకుండా ఒక స్ట్రిప్ తీసుకుని రోజుకో టాబ్లెట్ వేసుకునేవాడిని(?). అట్లా సుమారు ఒక సంవత్సరం వాడి వుంటాను!! నెలకో రెండు నెలలకో నాకు పొత్తి కడుపులో నొప్పి వచ్చేది.. బలవంతం మీద కంట్రోల్ చేసుకోవలసి వచ్చేది. టాబ్లెట్స్ వాడిన ఫలితమో లేక ఏమో తెలీదు కానీ నాకు వొంటి మీద హెయిర్ కానీ మీసాలు కానీ రాలేదు చూడటానికి ఆడపిల్లలా ఉండేవాడిని.. అన్నయ్యా, అశోక్ వాళ్ళతో కన్నా ఆంటీ, అమ్మ, వైష్ణవి లతోనే నాకు ఉండాలనిపించేది.. అమ్మకు వంటలో సాయం చేసేవాడిని(?). అమ్మకు బట్టలు ఉతికి పెట్టేవాడిని. ఇవన్నీ నాన్నకు కానీ దీపక్ అన్నయ్యకు కానీ తెలియనిచ్చేది కాదు అమ్మ. వాళ్ళు నన్ను తిడతారనే భయం. అమ్మకు నేను బాధపడితే అసలు ఓర్చుకునేది కాదు.... అమ్మ ఆంటీ సహాయంతో నన్ను ముస్తాబు చేసి వైష్ణవితో ఆడుకోమ్మనేది!! అప్పుడు నాకు స్వర్గం లో విహరించినంత సంతోషం గా ఉండేది!! ఇట్లా నాకు 14 ఏళ్ళు వచ్చేవరకూ సాగింది.

నాకు 14సంవత్సరాలు వచ్చినా నాలో ఏదో అసంతృప్తి ఉండేది. నేను నా పురుష శరీరంలో ఇమడలేకపోవడం నాకు అవగతమవుతూ వచ్చింది. ఒక సాయంత్రం అమ్మకు, ఆంటీకి నా బాధ చెప్పుకున్నాను. అమ్మ, ఆంటీ నిర్ఘాంత పోయారు. అమ్మ ఎట్టకేలకు తేరుకుని "నాని నాకు ఆడపిల్ల లేని లోటు తీర్చుకోవటానికి లేక నిన్ను ఆడపిల్లలా చూసి మురిసిపోవడం జరిగింది. కానీ నువ్వు ఈ విషయం సీరియస్ గా తీసుకుంటావ్ అనుకోలేదు. మీ నాన్న అన్నయ్యలకు తెలిస్తే నన్ను చీరేస్తారు. మన బంధువులలో ఈ విషయం కానీ తెలిసిందంటే మనం చులకన అయిపోతాము. నా తప్పును మన్నించి ఈ విషయం ఇంతటితో మర్చిపోవటానికి ప్రయత్నించు" అంది. ఆంటీ చాలా సైలెంట్ గా ఏది ఆలోచిస్తూ ఉంది. నేను అమ్మ మాటలతో నిరుత్సాహ పడిపోయి రోదిస్తున్నా. అప్పుడు ఆంటీ అంది "ఇంత అందమైన నా కోడలు ఏడుస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. ముందు ఆ ఏడుపు ఆపెయ్యి. నువ్వు ఎలా కావాలనుకుంటే అట్లా ఉండు. ఇక నుండి నీకు అత్తనైనా అమ్మనైనా నేనే అనుకుని నన్ను ఏం కావాలంటే అది అడుగు. అమ్మ నేను మాట్లాడుకోవాలి! నువ్వు ప్రక్కకి వెళ్ళవే కోడలు పిల్లా అని నా బుగ్గ గిల్లింది. నా మనసులో ఏదో అనుమానం. కానీ ఆంటీ మాటలకు నా మనసంతా ఆనందంతో నిండి పోయింది.

ఆంటీ వెళ్ళిపోయాక అమ్మ నన్ను పిలిచి " ప్రతీ శనివారం నీకు స్కూల్ సెలవు కదా! అప్పుడు ఆంటీ నిన్ను వాళ్ళింటికి వచ్చెయ్యమంది! మరి వెళతావా! మనింట్లో అయితే ఈ రహస్యాన్ని నేను కాపాడలేను చిట్టి తల్లీ" అంటూ నన్ను కౌగిలించుకుని చెప్పింది. అప్పుడు చెప్పింది ఆంటీ కీ తనకూ జరిగిన సంభాషణ!!

ఆంటీ "వదినా! ఈ రోజుల్లో పిల్లలకు అసంతృప్తి కలిగితే మనం అణచటానికి చూస్తే వాళ్ళు ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడతారు!! నానీ కి ముందునుండి మనమే అట్లాంటి భావం కల్పించాం! ఇందులో నానీ తప్పేమీ లేదు. ఇదంతా మన పొరపాటే. నువ్వు అమ్మగా కూతురు కావాలనుకున్నావు. నాకెందుకో నానీ పుట్టక ముందునుండీ నీ కడుపున ఒక కూతురు పుడితే బాగుండు నా స్నేహితురాలితో సంబంధం కలుపుకోవచ్చు అనుకున్నా! అందుకే నానీ మగాడిగా పుట్టినా ఆడపిల్లలానే కనిపించాడు. చూద్దాం! భగవత్సంకల్పం యెట్లా ఉంటుందో! ఈ విషయంలో ఇంకేమీ ఆలోచించకు. అంతా నాకు వదిలెయ్యి. ఇంకా డ్రెస్ లూ అవీ అంటావా వైష్ణవి బట్టలు సరిగ్గా నానీకి సరిపోతాయి. ఇద్దరూ ఒక ఈడు వారేగా! ఏమో వాడి అద్రుష్టం బాగుండి మీ అన్నయ్య కూడా ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ వెళ్ళారు కదా! నెలకోసారి కానీ రారు. ఇంకా అశోక్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోతున్నాడు .... వాడూ బెంగుళూరు వెళ్ళిపోతాడు. నేనూ వైష్ణవి ఉంటాం కాబట్టి బయటకు పోక్కే సమస్యే లేదు. ఇంకా నానీ నీ కొడుకు కాదు.... నా కోడలు.... అంతా మంచే జరుగుతుంది. నా కోడలు జాతకురాలు... దానికి కష్టమనేదే రాదు. రేపు నానీ ని ఒక్కసారి తీసుకురా. మనిద్దరమూ విజయవాడ వెళ్ళాల్సిన పని ఉంది. మనకు సహాయంగా ఉంటాడు(?)" అని అమ్మను ఒప్పించిందని అమ్మ చెప్పింది.

330 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login