Family · Telugu

ఒక యువరాణి కథ

Completed | Part 2 of 9 | 0 Likes

Part 2

ఆ మరుసటి రోజు నా జీవితంలో ఎంతో ఆనంద దాయకమైన రోజు. అమ్మ ఏదో పని ఉందేమో ఆంటీకి అనుకుని నన్ను కూడా తీసుకు వెళ్ళింది కదా! ఇంతకీ ఆంటీ మా ఇద్దరినీ తీసుకుని వాళ్ళ కారులో విజయవాడ లేడీస్ షోరూంకి తీసుకు వెళ్లి నాకోసం 2జతల పట్టు పావడాలు, 6 నైటీలు, ప్యాడెడ్ బ్రాలు, పాంటీలు, అక్కడినుండి చీపుల షాప్ కి తీసుకువెళ్ళి హై హీల్స్ 2 జతలు, ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ కి తీసుకు వెళ్లి సాధారణ నగలు, షాపింగ్ మాల్ లో 2 హెయిర్ విగ్స్ కొన్నది. అమ్మ ఇవన్నీ చూసి ఏదో అనబోయింది కానీ ఆంటీ చేత్తోనే వారించింది. ఇంకా అమ్మ మాత్రం చేసేది ఏముంది? ఆ తరువాత విజయవాడలో ఆంటీకి తెలిసిన ఒక లేడీస్ టైలర్ ఉంటే అక్కడికి వెళ్లి బ్లౌసెస్ కుట్టమని ఇచ్చింది. వాడు ఔమానమ్ గా చూస్తే నేను ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నానని చెప్పి వాడి అనుమానాన్ని తీర్చింది. ఇవన్నీ చూసిన నా కళ్ళకు నమ్మ బుద్ధి కలగలేదు. స్వర్గంలో విహరించినంత ఆనందం. ఏడుపు వచ్చేసింది. ఇంటికి వచ్చిన తరువాత ఆంటీ ని కౌగిలించుకుని ఏడ్చేసాను. ఆంటీ "ఏమిటే కోడలు పిల్లా చిన్న పిల్లలా! ఇదంతా నా కోడలి కోసం చేస్తున్నా! ఇంకా ఏడుపు ఆపేసి ఇంటి పనులూ, వంట పనులూ నేర్చుకో! రేపు అత్తగారింటికి వెళ్ళాక ఏ పనీ రాదంటే యెట్లా!" అంది. మా అమ్మ లేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇంకా అనుమానంతో ఎప్పటికీ ఆంటీ దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. నాకు కూడా అర్ధం చేసుకునేంత వయసు లేదు కాబట్టి అంత ఆలోచించలేదు. ఇప్పుడు తలుచుకుంటే ఆంటీ నా గురించి ఎంత ఆలోచించిందో అర్ధమవుతూ ఉంది.

ఆ మరుసటి రోజే శనివారం. నా కల నిజమయ్యే రోజు. కానీ నేను శుక్రవారం జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ ఆలస్యంగా నిద్ర పోయానేమో త్వరగా లేవలేక పోయాను. అమ్మ హాల్ లో నుండి నానీ! ఈ రోజు ప్రైవేటు క్లాసు ఉందన్నావుగా! లే లేచి త్వరగా తయారు కా. మీ టీచర్ కూడా నిన్న ఫోన్ చేసింది. కొన్ని సబ్జెక్ట్స్ లో వీక్ గా ఉన్నావట!! త్వరగా వెళ్ళు అని గట్టిగా కేకలు వేస్తోంది. మొదట నాకు అర్ధం కాలేదు అమ్మ కోడ్ బాష. లేచినవెంటనే డైలీ రోటీన్స్ అన్నీ ముగించుకొని బయటకు వచ్చాను. నాన్న గారు బ్యాంకు కు వెళ్ళే హడావిడిలో ఉన్నా "ఏరా! నానీ అమ్మ చెప్తోంది నిజమేనా? ఇట్లా అయితే ఎలా? ప్రతీ శనివారం సెలవే కదామీ టీచర్ ఇంటికి వెళ్లి వీక్ గా ఉన్న సబ్జెక్ట్స్ లో డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో!" అన్నారు. నాకు నవ్వు వచ్చింది కానీ అది సమయం కాదుగా!! ఆయన అలా కార్ స్టార్ట్ చేసారో లేదో అమ్మను గట్టిగా హత్తుకుని థాంక్స్ చెప్పాను. అమ్మ చిరునవ్వుతో "నీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను బంగారం! బయట సమాజం విషయంలో మాత్రం మనం చులకన కాకూడదు! కొంచెం జాగ్రత్త! అయినా అన్నీ జానకి ఆంటీ చూసుకుంటుంది లే!" అంటూ సోఫా నుండి లేచి బెడ్ రూమ్ లోకి వెళ్లి తిరిగి వస్తూ "ఇవిగో! ఇవి నీ పుట్టింటి వాటా అంటూ నవ్వుతూ ఒక సంచీ చేతిలో పెట్టింది. ఏమిటో అని తీసి చూడబోతే మీ అత్తగారి దగ్గరికి వెళ్ళిన తరువాత చూద్దువులే! అప్పటిదాకా సస్పెన్స్! అంటూ నన్ను సాగనంపింది! నా మనసులో యేవో ఆనంద వీచికలు!! ఆంటీ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఆంటీ ఒక్కత్తే ఉంది. "వైష్ణవి లేదా ఆంటీ? అని అడిగాను.... ఆంటీ నవ్వుతూ నాకోడలితో ఏకాంతంగా మాట్లాడుకోవాలి...... అని వైష్ణవి ని తన ఫ్రెండ్ ఇంటికి పంపాను..... అంటూ లోనికి వెళ్ళగానే తలుపు మూసివేస్తూ ఈ రోజు ఈవెనింగ్ వరకూ ఎక్కడికీ వెళ్ళడానికి కుదరదు. ఏవైనా పనులున్నాయా? అని అడిగింది జానకీ ఆంటీ. అందుకు నేను "అమ్మ ఇక మీరు ఏమి చెప్తే అదే చెయ్యమన్నది ఆంటీ" ఇక నుండి మీ ఇష్టం! ఒకానొక సమయంలో ఆత్మహత్యే శరణ్యము అనుకున్నా ఆంటీ. అంత నలిగిపోయాను.... ఈ మగ శరీరంలో...... నన్ను ఇంతగా అర్ధం చేసుకుని.... నా గురించి ఎంతగానో ఆలోచించి .... నాకు స్త్రీ రూపం ఇవ్వబోతున్న మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు ఆంటీ! ఏ పనులూ ఇంపార్టెంట్ కాదు ఆంటీ అన్నాను..... గొంతు గాద్గదికం అయ్యిపోయింది!! ఆంటీ వాతావరణాన్ని తేలిక పరుస్తూ ఇట్లా మాట్లాడుతూ ఉంటే శనివారం అయిపోయి ఆదివారం వచ్చేస్తుంది! అంటూ నన్ను బెడ్రూంలోకి తీసుకువెళ్ళి అటాచెడ్ బాత్ రూం లోకి తీసుకువెళ్ళి గీజర్ ఆన్ చేసి ముందు కొంచెం శరీరాన్ని తడుపుకొని హెయిర్ రిమూవింగ్ క్రీం రాసుకుని వేడి నీళ్ళతో స్నానం చేసిరా! బెడ్ పైన పాంటీ, పాడెడ్ బ్రా పెడతాను అవి వేసుకున్నాక నైటీ వేసుకుని రా! తరువాత ఏం చెయ్యాలో చెప్తాను అన్నారు ఆంటీ! ముందు చెప్పినట్లు నా బాడీ మీద హెయిర్ అంతగా ఎదగలేదు! హెయిర్ రిమూవింగ్ క్రీం అంతగా పెట్టుకోనక్కరలేకుండానే ఉన్న కొంచెం హెయిర్ తొలగిపోయింది! ముఖము పైన మాత్రం అస్సలు వెంట్రుక అనేదే మొలవలేదు!! బహుశా ఈస్ట్రోజెన్ టాబ్లెట్స్ ఫలితమేమో! త్వరగా స్నానం ముగించుకుని శరీరాన్ని చక్కగా తుడుచుకొని టవల్ చుట్టుకొని బయటకు అడుగుపెట్టాను. రూంలో ఎవరూ లేరు! ధైర్యంగా బ్రా మరియు పాంటీ తొడుక్కుని .... ప్రక్కకు చూద్దును కదా..... వైట్ కలర్ మీద గులాబీ పువ్వులున్న డిజైన్ తో క్రొత్త నైటీ ఉంది..... అది తీసుకుని తొడుక్కున్నాను . ఆంటీ ని పిలిచాను.... ఆంటీ లోపలి వస్తూ ఈ నైటీ వైష్ణవి కన్నా నీకే చక్కగా అమరింది ... అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడిపించింది! అక్కడ ఒక సూట్ కేసు ఉంది ..... ఆంటీ దాన్ని తెరచింది! అందులో ఉన్న విగ్ తీసి నా తల పైన అమర్చింది! కళ్ళకు సుర్మా..... పెదవులకు లిప్స్టిక్ రాసి ఒకసారి నన్ను పరికించి చూసి "ఎంత అందంగా ఉన్నావే కోడలుపిల్లా " అంటూ నుదిటిపైన ముద్దిచ్చింది! నువ్వు నిజంగా ఆడపిల్లవైతే ఇంటి పనులు అన్నీ నేర్చుకోవాలి .... అందుకే ఈ రోజు నుండి ప్రతీ శనివారం ఒక్కో వంటకం నేర్చుకోవాలి నువ్వు! భోజనం తరువాత నీకు నచ్చినట్లు తయారవుదువు అంటూ కిచ్చెన్ లోకి తీసుకువెళ్ళి అన్నీ చూపించి ...... మరి నువ్వు రెడీ యేనా అంటూ నా వైపు చూసింది ఆంటీ. నేను రెడీ అంటూ తలాడించాను!

ఆ రోజు ఆంటీ అంట్లు ఎలా తోముకోవాలి, కిచెన్ ఎలా సర్దుకోవాలి, కూరగాయలు ఎలా తరగాలి అనే విషయం మీద ట్రైనింగ్ ఇచ్చారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పనులన్నీ 12 గంటలకు ముగించి ఆంటీ వండిన పప్పుచారు, ఆలు వేపుడు వడ్డించుకుని ఇద్దరమూ కలిసే తిన్నాము. కాసేపు నిద్రపోదామా? అంది ఆంటీ. నాకేమో ఎప్పుడెప్పుడా క్రొత్త బట్టల్లో నేను ఎలా ఉంటానా అని ఆలోచిస్తూ నా మనసు నిలవడం లేదు. ఆంటీ అలా అనేసరికి ఏం చెప్పాలో తెలీలేదు. ఆంటీ వెంటనే నవ్వేస్తూ "నీ మనసు నాకు తెలుసు కానీ" అంటూ బీరువా తీసి "ఇంకా రెండు వారాల్లో వరలక్ష్మీ వ్రతం ఉంది. అప్పుడు కట్టుకుందువు గానీ ఇప్పటికి కాటన్ చీరలు ట్రై చెయ్యి. నీకు చీరల్లో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది సరేనా!" అని నా వైపు చూసారు ఆంటీ. నేను సరేనన్నాను. ఏ డ్రెస్ అయితే ఏంటి మగ వాళ్ళ డ్రెస్ కాకపోతే సరి అనుకున్నా మనసులో. ఆంటీ లైట్ బ్లూ కలర్ డిజైన్ ఉన్న వైట్ శారీ, మాచింగ్ బ్లౌస్, లోలంగా, వైట్ కలర్ బ్రా, పాంటీ తీసి "ఆ నైటీ విప్పేసి చక్కగా స్నానం చేసి ఈ చీర కట్టుకో నానీ అంటూ ఇంకా నువ్వు నానీవి కాదు సహజం గానే అందంగా ఉన్నావు కాబట్టి నీ పేరు ఇక "లావణ్య " అన్నారు. నాకు ఒక్కసారిగా తనువంతా పులకరించింది. ఆంటీ నీ పేరు నీకు నచ్చిందా లావణ్యా ? అని అడిగారు. నేను "ఆంటీ నాకు మీరేమని పిలిచినా ఇష్టమే ఆంటీ! ఈ జీవితమే మీది" అంటూ ఆంటీ ని హత్తుకున్నాను! చీరలోకి మారుతున్నావుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్ అంటూ చిన్నగా మొట్టికాయ వేసారు ఆంటీ! సరే తయారు అవ్వు నాకు చిన్న పని ఉంది అంటూ ఆంటీ బయటకు వెళ్లారు. వెంటనే గీజర్ ఆన్ చేసుకుని స్నానం చేసి టవల్ కట్టుకుని బయటకు వచ్చి ముందు బ్రా, పాంటీ వేసుకుని జాకెట్టు వేసుకుంటుంటే హుక్స్ దగ్గరకు వచ్చేసరికి ఏదో తెలియని పులకింత! గుండెల మీద ఎవరో హార్మొనీ వాయిస్తున్నట్లు. ఆ తరువాత తలపైనుండి లోపలి లంగా తొడుక్కున్నాను. లంగా కింద ఫిల్టులు కాలిమడమ కు తగులుతూ ఉంటే అదో రకమైన అనుభూతి. చీర కట్టుకున్నావా అంటూ ఈలోపల ఆంటీ లోపలి వచ్చారు. "ఆడదాన్ని నాకే నిన్ను చూస్తే కొరుక్కు తినేయ్యాలనిపిస్తుంది రేపటి రోజున ఏ అయ్య చేతిలో పడతావో " అన్నారు ఆంటీ. ఛీ పొండి ఆంటీ అని సిగ్గు పడ్డాను నెను. చీర మడతలు విప్పి ఎలా కట్టుకోవాలో నేర్పారు ఆంటీ. నలుగురిలో ఉన్నప్పుడు చీరలో ఎలా ప్రవర్తించాలో, మగ వాళ్ళ చూపులు ఆడవాళ్ళని ఎక్కడెక్కడ తడుముతాయో అప్పుడు స్త్రీ ఎలా ఉండాలో వివరంగా చెప్పారు. ప్రక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో నుండి చిన్న బాగ్ తీసి అందులో ఉన్న నగల్ని నాకు అలంకరించింది ఆంటీ. గాజులు రెండు రకాలు బంగారం, మట్టి గాజులు కూడా తొడిగింది. మెడలో సన్నని బంగారం గొలుసు. కాలికి వెండి పట్టాలు. మార్నింగ్ నా తలపై పెట్టిన హెయిర్ విగ్ తీసేసి పొడుగాటి హెయిర్ విగ్ అమర్చారు. ఫ్రిజ్ నుండి తీసి తాజా మల్లెపూలు నా జడలో పెట్టారు. మరీ హై హీల్స్ కాకుండా ఫ్లాట్ చెప్పులు (చాలా ఖరీదు ఉండొచ్చు) వేసుకుని అటూ ఇటూ తిరగమన్నారు. ఎలా నడవాలో చూపించారు. ఇంతలో తలుపు చప్పుడయ్యింది. ఆంటీ తలుపు తీయటానికి వెళ్ళారు. నాకు ఎవరో అని భయంవేసి ముచ్చెమటలు పట్టడం మొదలయ్యింది. ఎవరో కాదు అమ్మా, వైష్ణవి ఇద్దరూ ఒక్కసారే లోపలి వచ్చారు. అమ్మ నన్ను చూసి మురిసిపోయింది. అసలు ఇప్పుడు మా నాన్న కానీ, అన్నయ్య కానీ ఇద్దరూ చూసినా నన్ను గుర్తుపట్టలేరు అంది. ఇక వైష్ణవి అయితే ఈ కాలనీ లో అసలు ఫ్రెండ్స్ లేరు అనుకున్నా కానీ మా వదిన వచ్చాక ఆలోటు తీరిపోయింది అంటూ నా చేతులు పట్టుకుని గాజుల్ని సవరతీయటం మొదలు పెట్టింది అప్పుడే వరస కూడా కలిపేసావా అంటూ అమ్మ వైష్ణవి నెత్తి మీద చిన్నగా తట్టింది. వైష్ణవి అవును ఆంటీ! మా అన్నగాడికి ఇట్లాంటి భార్య రావాలని కోరుకుంటా. ఏమిటి నానీ ఒప్పుకుంటావా మా అన్నయ్య ని అంటూ జోక్ చేసింది. మేము నవ్వుకున్నాం. ఈ లోగా ఆంటీ అందరికీ టీ తెచ్చారు. నాకు కూర్చో బుద్ధి అవ్వటంలేదు ... నిల్చో బుద్ధి అవ్వటంలేదు! కూర్చుంటే చీర నలిగిపోతుందేమో అనే అనుమానం. ఏమో ఆంటీకి ఎలా తెలిసిందో మేము చీర కట్టుకున్నాక కింద కూడా కూర్చుని పని చేసుకోవటంలేదా అట్లానే లావణ్యా ! ఫర్వాలేదు మంచం మీద కూర్చో ... నీ ఇష్టం వచ్చినట్లు మూవ్ అవ్వు .... మేము పరాయి వాళ్ళం కాదుగా అన్నారు! నేను మంచం మీద అమ్మ భుజం మీద తలపెట్టి కూర్చున్నా! "మా వదిన అమ్మ కూచి" అంటూ నన్ను ఆట పట్టించింది వైష్ణవి. అట్లా సాయంత్రం 6గంటల వరకూ కొనసాగింది నా ఆనంద యాత్ర. ఈవెనింగ్ నాన్న వచ్చే సమయం అయిపోయిందేమో మళ్ళీ లావణ్య నానీ గా మారిపోవాలి కదా. ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అమ్మ అది గ్రహించి నన్ను సముదాయించి అశోక్ లేడుకదా రేపు నీ కోడల్ని పంపుతా వదినా అంది. దానికి ఆంటీ "నువ్వు పంపడమేమిటి వదినా? దానంతట అదే రావాలి! లావణ్యా రేపు బయటకి వెళ్దాం. త్వరగా వచ్చెయ్యి. అన్నారు . నా మనసు తేలిక పడింది. అమ్మా నేనూ ఇంటికి వెళ్ళిన అర గంటకు నాన్న వచ్చేసారు. ఏరా నానీ క్లాసు కి వెళ్ళావా? అని అడిగితే అమ్మ వీడు మళ్ళీ బయట ఎక్కడ ఆడతాడో అని నేనే దగ్గర ఉండి తీసుకెళ్ళాను అంది. మంచి పని చేసావ్ అంటూ మెచ్చుకోలుగా చూసారు! పాపం ఇప్పుడు తలచుకుంటే అమ్మ నాకోసం ఎన్ని పాట్లు పడిందో అనిపిస్తుంది. ఆ రోజు నా జీవితంలో కాళరాత్రి. నిద్ర పోతున్న వేళ నాకు సన్నగా పొత్తి కడుపులో నొప్పి మొదలయ్యింది! అమ్మతో చెప్తే ఎండోఫర్ టాబ్లెట్స్ ఇచ్చి పడుకో అంది కానీ నొప్పి తగ్గలేదు.

320 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login