ఎంతకీ బాధ తగ్గటం లేదు! ఆంటీకి ఫోన్ చేశాను. ఆంటీ ఇంత రాత్రి ఏమిటమ్మా? అంటూ లాలనగా ఫోన్ లోనే అడిగింది. పొత్తి కడుపులో నొప్పి వస్తోంది ఆంటీ. సరిగా గమనించలేదు కానీ 6 మంత్స్ నుండి ఇట్లానే నెలకోసారి 3 నుండి 5 రోజుల పాటు ఇట్లానే వస్తోంది ఈ సారి మాత్రం భరించలేకపోతున్నా అని చెప్పాను. ఆంటీ తుళ్ళి పడిందేమో చిన్నగా కాదు పెద్దగానే ఏమిటే మళ్ళీ చెప్పు అంది! నేను చెప్పాను. కాసేపు ఉన్న తరువాత నేను మా వాచ్ మాన్ ని పంపుతా ఎట్లానో గేటు దగ్గరికి వచ్చి టాబ్లెట్ తీసుకు వెళ్ళు. మరి నేను అనుకున్నది కరెక్ట్ అయితే నొప్పి తగ్గిపోవాలి అంటూ ప్రతీ అరగంటకూ నాకు ఫోన్ చెయ్యి ఏమైనా అర్జెంటు అయితే అమ్మను లేపు సరేనా అని అంది ఆంటీ. నెమ్మదిగా తలుపు తీసి గేటు దగ్గరికి వెళ్లాను.. అప్పటికే ఆంటీ వాళ్ళ వాచ్ మాన్ సైదులు యేవో టాబ్లెట్స్ తీసి ఇచ్చాడు . ఇంట్లోకి వెళ్లి చూస్తే అవి పాంప్రిన్ మాక్స్ టాబ్లెట్స్. అవి వేసుకుని పడుకున్న తరువాత పెయిన్ నుండి ఎంతో రిలీఫ్ వచ్చింది. ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఆంటీ కి ఫోన్ చేశా. నొప్పి తగ్గిపోయింది అని చెప్పాను. ఆంటీ ఏమిటే షాక్ మీద షాక్ ఇస్తున్నావు! సర్లే రేపు త్వరగా వచ్చెయ్యి. అసలు విషయం చెప్తా అని ఫోన్ పెట్టేసారు ఆంటీ. ఎన్నో రోజుల తరువాత సుఖంగా నిద్రపట్టింది ఆ పొత్తికడుపు లో పెయిన్ రావటం మొదలైన తరువాత.
ఆ ఉదయమే ఆంటీ ఇంటికి ప్రైవేటు క్లాసు కి వెళ్తున్నాననే వంకతో నాన్న పర్మిషన్ తో వెళ్లాను. ఆంటీ నాకోసం ఎదురు చూస్తున్నారు. నన్ను ప్రక్కనే కూర్చోపెట్టుకుని అనునయంగా "ఇప్పుడు చెప్పు. ప్రతీ నెలా పైన ఎక్కడ వస్తోంది" అని అడిగారు. నేను ఆమె చెయ్యి తీసుకుని పొత్తికడుపు పైన పెట్టి ఇక్కడ వస్తోంది ఆంటీ అన్నాను. అందుకు ఆమె నా అనుమానం నిజమైంది మనం మీ అమ్మన్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటూ ఈ రోజు నీకు రెస్ట్ ఇస్తాను ఇంటి పనులేమీ వద్దు.... ఆ గదిలో సల్వార్ కమీజ్ ఉన్నాయి.... నీ అండర్ గార్మెంట్స్ ప్రతీ సారీ నేను తీసి ఇవ్వలేను కానీ నీ ఆడపడుచును అడుగు అంటూ వైష్ణవి గది వైపు చూపించారు. నేను సంకోచిస్తుంటే లావణ్యా! ఇందులో ఏమీ సిగ్గు పడనక్కరలేదు. దానికి అన్నీ చెప్పాను వెళ్ళు దాన్ని నిద్రలేపు! అన్నారు. నేను వెళ్లి వైష్ణవిని నిద్రలేపాను. వైషు ఏమిటి వదినా ఆదివారం కూడా ఇట్లా లేపేస్తే నీకూ అమ్మకూ తేడా ఏముంది చెప్పు ..... అంటూ లేచి అండర్ గార్మెంట్స్ , నాకు సంబంధించిన మేల్ టు ఫిమేల్ ట్రాన్స్ఫర్మేషన్ మెటీరియల్ అంతా చూపించి మళ్ళీ ముసుగు తన్నేసింది ..... ఇంకా నేను వచ్చిన పనిని పూర్తిచేసుకోవాలి కాబట్టి ఆరామంగా నా శరీరం పైకి లావణ్యను రప్పించేసాను..... ఆంటీ సెలక్షన్ ఎప్పుడూ సూపర్బ్ గానే ఉంటాయి ... ఆ రోజు నేను వేసుకున్న సల్వార్ కొంచెం లైట్ గ్రీన్ మీద పింక్ కలర్ పువ్వుల డిజైన్ .... హెయిర్ విగ్ పెట్టుకుని ఫ్రిజ్లో పువ్వులు తీసుకుందామని బయటకు వచ్చేసరికి ఆశ్చర్యంతో పాటు భయం వేసింది. కారణం ఆంటీ తో మాట్లాడుతూ ఉన్న అశోక్ ను చూసేసరికి కాళ్ళలో చిన్న వణుకు. ఆంటీ నా కాళ్ళ పట్టీల శబ్దం విన్నారనుకుంటా వెనక్కి చూసి రావే కోడలుపిల్లా అంటూ కేజువల్ గా పిల్చారు... అశోక్ నా వైపు తిరిగిచూసి వావ్ ! అమ్మా నువ్వు చెప్తుంటే నమ్మలేదు కానీ లావణ్య రియల్లీ బ్యూటిఫుల్ అండ్ ఆసం అంటూ నావైపు ప్రశంస గా చూశాడు! నాకేమో యెట్లా ప్రవర్తించాలో తెలీలేదు! అప్పుడు అశోక్ కల్పించుకుని లావణ్యా! అమ్మ అంతా చెప్పింది. నువ్వేమీ కంగారుపడకు. ఈ రహస్యం మీ అమ్మతో పాటు మా ముగ్గురికీ తప్ప ఇంకెవరికీ తెలీదు ..... ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు! ఆంటీ నవ్వుతూ లావణ్యా! నీకేమి కావాలో నాకు తెలుసు .... నీకు అంతా మంచే జరుగుతుంది .... ఫ్రీగా ఉండు .... నీకోసం నేను కొన్న అన్ని డ్రెస్లూ ట్రై చేసుకో .... నీకేం కావాలో అన్నీ అడుగు .... ఇంకా సాయంత్రానికి చాలా టైం ఉంది.... అంతవరకూ ఇట్లానే నిలబడతావా! కొంచెం ఫ్రీగా ఉండవే తల్లీ అంటూ నా చేతులు లాగి సోఫాలో అశోక్ ముందు కూర్చోపెట్టారు! నేను తలెత్తలేక పోతున్నాను! ఆంటీ సరే నా బిడ్డ చాలా కాలానికి వచ్చాడు! వంట వండాలి . ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అన్తూకిచేన్ వైపు వెళ్ళారు! అశోక్ నా వైపు పరిశీలన గా చూస్తూ దీపక్ గాడికి ఇంత అందమైన చెల్లి ఉంటుందనుకోలేదు సుమా అంటూ కన్నుగీటాడు! నా ఒళ్ళు జల్లుమంది! నా అరిచేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ నువ్వేమీ భయపడనక్కరలేదు! అమ్మా నేనూ వైషూ నైట్ నీ గురించి మాట్లాడుకున్నాం! అమ్మకు నువ్వంటే ప్రాణం... ఎప్పుడూ నీకోసమే ఆలోచిస్తూ ఉంటుంది! సరేలే ఇవన్నీ ఇప్పుడెందుకు గానీ చెస్ ఆడుకుందాం సరదాగా సరేనా! అంటూ నా బెడ్ రూమ్ లో టేబుల్ పైన ఉంది చెస్ బోర్డు ...కొంచెమ్ తీసుకువస్తావా అన్నాడు! సరేనని తల ఊపి లోపలికి వెళ్లి చెస్ బోర్డు తీసుకుని వెనుదిరిగేసరికి రెండు చేతులు నన్ను దగ్గరికి తీసుకున్నాయి! నేను వైష్ణవి అనుకుని మీ అన్నయ్య తీసుకురమ్మంటే వచ్చాను అంటూ వెనక్కి తిరిగా! అశోక్ నన్ను చూస్తూ చిలిపిగా నవ్వుతున్నాడు! నాకేమి మాట్లాడాలో తెలీలేదు! "వెళ్ళాలి" అంటూ గొణిగాను! ఎక్కడికి అంటూ "అమ్మ నేను బెంగుళూరు లో ఉన్నప్పుడే ఫోనులో అంతా చెప్పింది! నాకు కోపం రావటం కాక ఆసక్తి కలిగింది నీ విషయంలో" అంటూ చెక్కిలిపైన ముద్దు పెట్టాడు! ఇంకెప్పుడూ ఒంటరిగా కనపడకు! నేను చెడ్డవాడిని అయిపోతా అంటూ బయటకి వెళ్ళిపోయాడు! స్థాణువులా నిలబడిపోయాను! ఆంటీ కి చెప్పాలా వద్దా అనుకుంటూ ఆంటీ నన్ను అభిమానించే తీరు చూసి దీని గరించి ఏమీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాను!
అశోక్ చేసిన పనిని తలచుకుంటూ ఆ రోజు ఉదయం నుండీ సాయంత్రం వరకు ఆంటీ వాళ్ళ ఇంట్లోనుండి వెళ్ళేటప్పుడు ఆంటీ "అమ్మను ఒక్కసారి ఫోన్ చెయ్యమను! నీ విషయం మాట్లాడాలి! అంది. సరేనని తల పంకించి ఇంటికి బయలుదేరాను! నేను ఇంట్లోనుండి వచ్చేటప్పుడు అశోక్ ఇంట్లో లేడు. వీధి చివరికి వచ్చేశాను ..... ఇంకా మా ఇంటికి 4 ఇళ్ళే దూరం. ఇంతలో మెల్లగా "లావణ్యా!" అనే పిలుపు వినిపించింది! ఉలిక్కిపడ్డాను.... తీరా చూస్తే అశోక్! ఎవరూ లేరు అందుకే పిలిచాను. మార్నింగ్ నిన్ను చూసి తట్టుకోలేక అలా ప్రవర్తించాను. ఏమీ అనుకోకు. అంటూ ఎల్లుండి బెంగుళూరు వెళ్ళిపోతాను! వెళ్ళే ముందు నీకు ఒక గిఫ్ట్ ఇక్కడ ఇవ్వను కానీ "మా ఇంట్లో అమ్మ నీకోసం ఏర్పాటు చేసిన రాక్ లో పెడతా చూసుకో అంటూ టేక్ కేర్ అంటూ చిరునవ్వుతో బైక్ ముందుకు దూకించాడు! నాకు ఎవరైనా తన మాటలు విన్నారేమోననే భయం! గుండె దడ దడలాడతుండగా ఇంట్లోకి వెళ్ళిపోయా! అప్పటికి మార్నింగ్ బంధువుల ఇంటికి విజయవాడ వెళ్ళిన నాన్న ఇంకా రాలేదు! అమ్మ నన్ను చూసి చిట్టి తల్లికి ఫోన్ చెయ్యకుండానే వచ్చేసింది! ఏమిటి విశేషం అంది! ఏం లేదమ్మా ఆంటీ నిన్ను ఫోన్ చేయ్యమంది అని చెప్పాను. ఎలాగూ మీ డాడీ లేరుగా ఇప్పుడే చేస్తాను! విషయమేమిటో అంటూ ఆంటీ కి కాల్ చేసింది! దాదాపు 15 నిమిషాలు మాట్లాడుకున్నారు ఇద్దరూ! ఈలోగా నేను స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఏమైనా స్నాక్స్ ఉన్నాయేమోనని చూస్తున్నాను! అమ్మ వచ్చి నానీ! రేపు స్కూల్ కి వెళ్ళకు మనం విజయవాడ వెళ్ళాలి అంది. ఏమిటమ్మా విషయం అని అడిగాను! నైట్ నాకు వచ్చిన నొప్పి గురించి, ఆంటీ ఇచ్చిన మెడిసిన్ గురించి, నేను ఆంటీ కి చెప్పిన నెల నెలా పొత్తికడుపు నొప్పి గురించీ అన్నీ వివరంగా చెప్పిందట ఆంటీ.
అమ్మతో రేపు విజయవాడ లో మాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒకాయన ఉన్నారు! ఆ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్దాం అన్నారట!
మర్నాడు ఉదయం డాడీ బ్యాంకు వెళ్ళిపోయారు! వెంటనే అమ్మ ఆంటీకి ఫోన్ చేసింది. ఆంటీ కాసేపటికి కారులో ఇంటికి వచ్చారు! మేము ముగ్గురమూ బయలుదేరి బయటకు వచ్చి కార్ ఎక్కి చూసే సరికి డ్రైవింగ్ సీట్లో అశొక్. అమ్మ ఆంటీ వైపు ఏమిటన్నట్లు చూసింది. ఆంటీ వాడికి అన్నే తెలుసు నువ్వేమీ భయపడనక్కరలేదు అంటూ కార్ డోర్ తీసింది. ముందు సీట్లో ఆంటీ, అశోక్ వెనుక సీట్లో అమ్మా, నేను. అశోక్ నార్మల్ గా ఉన్నాడు కానీ అమ్మకో, నాకూ తేదో సంకోచం. మొత్తానికి విజయవాడ చేరాము. డాక్టర్ దగ్గర ఆంటీ ముందుగానే అప్పాయింట్మెంట్ తీసుకున్నరేమో డైరెక్ట్ గా ఆయన రూంలోకి వెళ్ళాము. ఆయనకు ఆంటీ నా క్రాస్ డ్రెస్సింగ్ విషయం చెప్పకుండా కేవలం పొత్తికడుపు నొప్పి గురించి మాత్రమే చెప్పింది. డాక్టర్ నన్ను ఎగ్జామినేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి నా పోత్తికడుపునూ అన్నీ యాంగిల్స్ లోనూ పరీక్షగా చూసి అల్ట్రా స్కాన్ టెస్ట్, కొన్ని పరీక్షలు వ్రాసి చేయించుకు రమ్మన్నారు. అమ్మ లాబరేటరీ కి తీసుకు వెళ్లి మనీ పే చేసిన తరువాత అక్కడ పాథాలజిస్ట్ కొన్ని టెస్ట్స్ చేసి అబ్డోమిన్ స్కాన్ చేసిన తరువాత ఒక గంటాగి రమ్మన్నారు రిపోర్ట్స్ కోసం! ఆంటీ సరే భోజనం చేసి వద్దాం! అంటూ బయటకు తీసుకు వెళ్లి బందరు రోడ్లో ఉన్న స్వీట్ మేజిక్ రెస్టారెంట్ కి తీసుకువెళ్ళి భోజనం అవీ చేసాక మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. అప్పటికే టెస్ట్స్ రిపోర్ట్స్ అన్నీ ఆయన టేబుల్ మీద ఉన్నాయి. ఆయన ముందు మేము కూర్చున్న తరువాత 45 నిమిషాల పైగా అన్ని రిపోర్ట్స్ చూశారు.
అమ్మతో గతంలో ఏమైనా హార్మోన్ టాబ్లెట్స్ కానీ, ఇంజక్షన్ కానీ వాడారా అని అడిగారు. అమ్మ ఎప్పుడూ నాకు తెల్సి వాడికి మందులేమీ వాడలేదు అంది! ఆయన హార్మోన్స్ లో యేవో తేడాలున్నాయి చూద్దాం మందులు వాడండి అని ప్రిస్క్రిప్షన్ వ్రాసారు! ఇంటికి వచ్చేసాం! రాత్రి పడుకున్నాక ఏదో ఆలోచిస్తుంటే డాక్టర్ గారు అడిగిన క్వశ్చన్ గుర్తొచ్చింది "గతంలో ఏమైనా టాబ్లెట్స్ వాడారా?" అమ్మ వేసుకొనే ఈస్త్రొజెన్ టాబ్లెట్స్ సంవత్సరం పాటు వాడిన విషయం గుర్తొచ్చింది కానీ అమ్మకు చెప్తే చంపేస్తుంది. శనివారం ఆంటీ దగ్గరకు వెళ్ళినప్పుడు చెప్పొచ్చు తనే ఏదో సొల్యూషన్ చెప్తుందిలే అనుకొని నిద్రకు ఉపక్రమించాను
Discussion (0)