Office · Telugu

Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?

Completed | Part 5 of 14 | 0 Likes

Part 5

నందినికి నిద్ర పట్ట లేదు. సడన్ గా ఏదో గుర్తొచ్చింది. "ఆనంది!" అని పిలిచింది. "ఏమిటి వదిన?" అని చాల స్నేహంగా అడిగింది. "సాయంత్రం మనం వచ్చేటప్పుడు పూలు కొన్నావు కదా?" అని చెప్పింది. వెంటనే అమ్మాయిగారి మనసు పూలమీదకి మళ్ళిందన్న మాట. సరే అక్కడ ఫ్రిజ్ లో పెట్టాను. తీసుకురా. అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర స్లయిడ్స్ కూడా ఉన్నాయి. రెండు స్లైడ్స్ తీసుకురా". అంది. నందిని వెళ్ళి తీసుకు వచ్చింది. "నువ్వు ఎలా పెట్టుకుంటావోయ్ నా రాణి?'" అని అడిగింది. "నువ్వే హెల్ప్ చెయ్యాలి డియర్. అంది నందిని. చిన్నగా నవ్వుకుంటూ ఆనంది తన దగ్గరకు రమ్మని తను బెడ్ మీద కూర్చుని ఆమెను క్రింద కూర్చోమని, బ్రైడ్ బన్ చుట్టి రెండు స్లైడ్స్ తో బన్ కి చుట్టూ మల్లెపూల మాల చుట్టింది. కలలో ఎవడో రాజకుమారుడు వచ్చి నీ తలలో ఈ మల్లెపూలను ఆస్వాదిస్తాడేమో! అంది. నందిని కొద్దిగా సిగ్గు పడింది. ఆ తరువాత తనుకూడ నాలుగు మూరలు మల్లెలు తలలో తురుముకుంది. ఎలాగా నిద్ర లేవాల్సి వచ్చింది కదా అని లేచి తనకు నచ్చిన ది పాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్ .బుక్ చదువుతోంది. ఆ పుస్తకాన్ని చిత్ర బెనర్జీ వ్రాసింది. ఆ పుస్తకం ద్రౌపది దృష్ట్యా స్త్రీ దృక్పథం లో మహా భారత కథ. ఆధునిక స్త్రీ వాదుల చేతిలో తిరుగుతున్న పుస్తకం అది. ఇంచుమించు గా ఆ పుస్తకాన్ని పది సార్లయినా ఆనంది ఆ పుస్తకాన్ని చదివి ఉంటుంది. అయినా మరోసారి చదువుతోంది. ఆ పుస్తకాన్ని చూసి తనకి కూడా ఏదైనా పుస్తకం ఇమ్మని అడిగింది నందిని. అప్పుడు అనుజా చౌహాన్ వ్రాసిన "దోజ్ ప్రైసీ ఠాకూర్ గర్ల్స్" పుస్తకాన్ని చదవమంది. అది ఒక ఢిల్లీ యువతులు అందరూ చదివే హాస్య ప్రధానమైన నవల. ఇద్దరూ కాసేపు నవల కొన్ని పేజీలు త్రిప్పు తుంటేనే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు.
చూస్తూ చూస్తూ ఉండగానే తెల్లవారు జామున అయిదు గంటలైంది. "ఇదిగో అమ్మాయ్! లేవాలి. ముందు నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అని నందినిని ఆనంది లేపింది. నీకు ఇవ్వాళ పెసరట్టు ఉప్మా చేయటం నేర్పుతాను. ఇంతలో నువ్వు గెడ్డం షేవ్ చేసుకుని రావాలి. దానికి సాయంత్రం ఒక పరిష్కారం చూపిస్తాలే. అంది. తరువాత ఇద్దరూ స్నానం చేసి ఇంట్లో వేసుకునే మోకాళ్ళ వరకు వచ్చే ఫ్రాక్స్ వేసుకున్నారు. . తరువాత నందినికి పెసరట్టు ఉప్మా చేయడం నేర్పింది. తరువాత ఈ రోజు కూడా ఆఫీస్ లోనే లంచ్ చేద్దాం. అని చెప్పింది ఆనందిని. "ఇంకా టైం ఉంది కదా ఏదో ఒకటి వండేసుకుందాం". అంది నందిని. ఆ టైం లో మనం రూఫ్ గార్డెన్ దగ్గరకి వెళదాము. అని అయిదవ అంతస్తు పైన ఉన్న రూఫ్ గార్డెన్ దగ్గరకు వెళ్లారు ఇద్దరూ. అక్కడ కొన్ని పూల మొక్కలు, కొన్ని పళ్ల మొక్కలు, కొన్ని కూరగాయ మొక్కలు ఉన్నాయి ఒక స్పేస్ లో. ఇది మన స్పేస్. నేను మనం ఈ అపార్ట్మెంటు కు వచ్చిన రెండవ రోజు నుంచి ఈ స్పేస్ లో మొక్కల కుండీలను, అలాగే క్లే బాగ్ ప్లాంట్ లను పెంచుతున్నాను. అంది. నందిని కి ఆనంది అంటే ఇంకా గౌరవం పెరిగింది. ఆనంది చెయ్యి తన చేతిలోకి తీసుకుని ప్రేమతో గట్టిగా నొక్కింది. "ఏంటో అమ్మాయిగారికి ఆకస్మాత్ గా ఈ లవ్వు?" అని .అడిగింది ఆనంది. యు ఆర్ గ్రేట్ ఆనంది. అంది. "ఏదో ఆడవాళ్ళం తల్లీ. మా పనులన్నీ ఆడపనులు. మీరైతే అలా అలా చుడీదార్ కట్టుకుని అలా అలా చేసేస్తారు." అంది. మునుపు ఆ మాట అన్నందుకు తన బుర్రమీద తనే ఒక్కటిచ్చుకుంది నందిని. నెమ్మదిగా టెర్రస్ గార్డన్ లో కొంత సేపు గడిపి ఆ మొక్కలికి కావాల్సిన నీరు పోసి, అవసరమైన చోట కొకొ పిట్, సహజమైన బయో వేస్ట్ ఎరువులు వేసి చేతులు శుభ్రం గా కడుక్కుని నెమ్మదిగా క్రిందకు మెట్లు దిగి వచ్చారు. ఆ తరువాత ఇద్దరూ కుర్తి, లెగ్గిన్స్ వేసుకుని సింపుల్ మేకప్ వేసుకుని ఆఫీస్ కి కార్లో బయల్దేరారు. (సశేషం)

3384 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login