ఆనంది కావాలనే అలా నందినిని నడిపించింది. వయ్యారంగా రోడ్డుమీద నడుస్తుంటే అలవాటు పడుతుంది అని. అయితే నందినికి ఆఫీస్ లో పరిస్థితి ఎలా ఉంటుందో అని జంకులో తను రోడ్డుమీద నడిచి వచ్చానని కూడా మరచి పోయింది. గమనించ లేదు. సెక్యూరిటీ వాళ్ళు నందినిని పరీక్షగా చూసి ఆమె ఐడి కార్డు చూసి అటు ఇటు చెక్ చేసి నట్టు చేసి అక్కడ నుంచి బయో మెట్రిక్ ద్వారా లోపలికి పంపించారు. అక్కడున్న సెక్యూరిటీ నవ్వుకోవడం ఆమె చూడలేదు. కారణం ఆ సెక్యూరిటీ ఇద్దరూ వీళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ లోనే సెల్లార్ లో ఉంటున్న వాచ్ మెన్ కొడుకులు. ఆవిషయం ఆనందికి తెలుసు. అందుకని ముందే వాళ్ళకి పొద్దున్నే చెప్పింది. ఇలా నందిని వస్తుంది. లోపలికి పంపమని. అల్లాగే రిసెప్షనిస్ట్కి కూడా కొద్దిగా ప్రశ్నలు వేసి కంగారు పెట్టమని చెప్పింది. అలాగే కాసేపు రిసెప్షనిస్ట్ కూడా కాసేపు నందినితో ఆడుకుంది. ఆ తరువాత ఆనంది వెళ్ళి తన కాబిన్ లో కూర్చుంది. నందిని తడబడుతూ వెళ్ళి తన కాబిన్ లో కూర్చుంది. వరుసగా లేడీస్ స్టాఫ్ అంతా నందిని దగ్గర కు వచ్చి "మీ పేరు ఏమిటి మేడమ్? . ఎప్పుడు జాయినయ్యారు. మేం ఏమి అడిగినా ఆనంది మేడమ్ ఆస్క్ హర్. షి విల్ టెల్ యు. అంటూ మీ దగ్గర కు పంపారు మమ్మల్ని". "చెప్పండి మేడం .. చెప్పండి మేడం .." అంటూ పదే పదే అడుగుతున్నారు. నందినికి చెమటలు పట్టాయి. అయితే తెలియనివ్వకుండా తన కర్చీఫ్ తో చెమట తుడుచుకుంటూ వాళ్ళను ఎలాగో కన్విన్స్ చేసింది. తరువాత మేల్ మెంబర్స్ వచ్చి పలకరించి వెళ్లారు. తరువాత సీనియర్ మేనేజర్ కూడా తన రూం కు పిలిచి అవి ఇవి అన్నీ అడిగి కొంచెం కంగారు పెట్టి తరువాత కంగ్రాట్స్ ఫర్ యువర్ న్యూ అసైన్మెంట్ నందు. ఆనంది మెస్సేజ్డ్ అజ్ ఎబౌట్ యువర్ బెట్. ఐ విష్ యు ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఛాలెంజ్." అని చెప్పాడు. ఇదంతా అయ్యే సరికి సాయంత్రం అయ్యింది. నెమ్మదిగా నడుచుకుంటూనే ఇంటికి బయల్దేరారు. దారిలో ఆనంది పూల కొట్టు దగ్గర ఆగి రోజూ నాలుగు మూరలు కొనేది ఈ రోజు ఎనిమిది మూరలు కొంది. తరువాత దారిలో సాయంత్రానికి కావాల్సిన వెజిటబుల్స్ కొంది. అపార్ట్మెంట్ లో క్రింద ఆడుకుంటున్న పిల్లలని ఒక సారి పలకరించింది. వాళ్ళు కూడా హాయ్ ఆంటీ అంటూనే మీ పక్కన ఉన్న ఆంటీ ఎవరు ఆంటీ? అని అడిగారు. ఈమె నందిని ఆంటీ. మనతో పాటు ఆరు నెలలు ఉంటుంది. అని చెప్పింది. తరువాత వాళ్ళు ఇద్దరూ తమ అపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టాక నందిని తన వానిటీ బాగ్ ను సోఫాలో గిరాటేసి టీవి పెట్టబోయింది. ఇంతలో ఆనంది "ఏంటమ్మా! అలా కూర్చున్నావ్? వంట ఎవరు చేస్తారే? నీ మగడా? వెళ్ళు వెళ్ళు కిచెన్ పిలుస్తోంది. టీవి సంగతి నేను చూసుకుంటాను" అని కిచెన్ లోకి తోసింది. అలా తోస్తుంటే, అలా పిలుస్తుంటే ఏదో తియ్యగా ఉంది నందినికి. కానీ వంట పేరు చెప్పేసరికి గతుక్కు మంది. "ఆనంది!" అంటూ నసగటం మొదలు పెట్టింది. "ఏం వదినా?". అని అడిగింది. ఈ కొత్తవరుసని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు నందినికి. ఆనంది, మరీ మరీ .. వంట .. వంట." అని నాన్చుతోంది. ఇంతకీ ఏంటమ్మా నువ్వు ఏం వండగలవో అదే వండు. అంది ఆనంది. నేను వెజిటబుల్ పలావ్ మాత్రమే చేయగలను. అంది. సూపర్ .. అయితే ఇక మొదలు పెట్టు. అంది. ముందు సరే ఫ్రెష్ అయ్యి వచ్చి చేస్తా. అంది. గుడ్ బేబీ. అలాగే. అని చెప్పాకా నందిని బాత్రూం లో స్నానం చేసి మళ్ళీ బ్రెస్ట్ ఫార్మ్స్ పెట్టుకుని మరో బ్రా కట్టుకుని నైటీ కట్టుకుని బయటకు వచ్చింది. తన జుట్టు కూడా బన్ చుట్టుకుని వెజ్ పలావ్ మొదలు పెట్టింది. అలాగే అనియన్ కర్డ్ రైతా కూడా చేసింది, ఇంతలో ఆనంది కూడా రెడీ అయి వచ్చింది. నెమ్మదిగా రాత్రి తొమ్మిది గంటలకు వాళ్ళు డిన్నర్ అనబడే ఆ తంతు పూర్తి చేశారు. నెమ్మదిగా బెడ్ రూంకి వెళ్లారు. ఆరోజు జరిగిందంతా ఒక రీల్ లాగా నందిని కళ్ళ ముందు కనబడింది. సడన్ గా నందిని ఆనంది ఎందుకు అందరికీ ఈ రోజు మెసేజ్ చేశావ్? అని అడిగింది. "ఓసి నా ముద్దుల బేబీ! నేను కనక నీ గురించి చెప్పక పోతే ఇప్పటికి కూడా ఆఫీస్ premsis లోకి నిన్ను రానిచ్చేవారు కాదు". అంది. అవును నిజమే. నీకు థాంక్స్. అయితే చూడు ఇవ్వాళ నేను చుడీ దార్ వేసుకుని వచ్చి ఎలా .అందర్నీ నేను ఒక ఉమన్ అని నమ్మించానో? అంది నందిని. నువ్వు నిజంగానే పిచ్చి మొహానివే. చుడీదార్ తొడుక్కున్నంత మాత్రాన ఆడదైపోతావా? అయితే నేను జీన్స్ పాంట్, షర్ట్ వేసుకుని టక్ చేస్తే నేను ఆడదాన్ని కాకుండా పోతానా? నీకు అర్థం కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పిల్లా.! ఇంక పడుక్కో పొద్దున్నే లేచి నీ బరువులు తిప్పుకుంటూ చాలా పనులు చేయాలమ్మా." అని ఓరగా చూస్తూ చెప్పింది. నెమ్మది గా ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. (సశేషం)
Office · Telugu
Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?
Completed
|
Part 4 of 14
|
0 Likes
Part 4
3383 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)