సుధ విషయంలో దీపిక ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. ఆడపిల్లగా సుధకి ఏంచేయాలని ఇష్టం అని అడిగింది. అందుకు సుధ సంగీతం, నృత్యం నేర్చుకుంటానని, కుట్లు, అల్లికలు, రంగోలి, పెయింటింగ్, వంట, వార్పూ నేర్చుకోవాలని ఉందని చెప్పింది. తనకు తెలిసిన మ్యూజిక్, డాన్సు స్కూల్ లో చేర్పించింది.టీచర్స్ కు సుధ విషయం చెప్పింది. ఇంట్లోనే కుట్టు మిషను కొనిపించి కుట్లు, అల్లికలు, రంగోలి, వంటావార్పు తనే నేర్పింది. అలాగే తాను ఇంటర్మీడియట్ పాసవ్వ గానే నర్సు ట్రైనింగ్ అయ్యింది. అక్కడ తనకు ఫ్రెండ్ అయిన కోమలి ఒక గైనకాలజిస్ట్ దగ్గర పనిచేస్తోంది అని తెలుసు. అందుకని ఆమెకు ఫోన్ చేసి సుధ విషయం చెప్పి సలహా అడిగింది. అప్పుడు కోమలి ఒక ఆసక్తి కరమైన విషయం చెప్పింది. తను పనిచేసే గైనకాలజిస్ట్ భర్త హైదరాబాద్ లో ఒక ట్రాన్స్ జెండర్ క్లినిక్ నడుపుతున్నారని ఆయనని కలుద్దాం. అని చెప్పింది. అప్పాయింట్ మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళారు. ఆయన, సైకాలజిస్ట్ లు ఒక మూడు రోజుల పాటు పరీక్షలు చేశారు. సుధ పొరపాటున మగ పిల్లవానిగా పుట్టిన ఆడ పిల్ల అని నిర్ధారించారు. కారణం ఆమె లో స్త్రీత్వం అంత బలీయం గా ఉందని పరీక్షల్లో నిర్ధారించారు.
సుధకి ముందు ఒక సంవత్సరం పాటు HRT treatment ఇద్దామన్నారు. అక్కడికి సావిత్రమ్మ కూడా వచ్చింది. సుధ, సావిత్రమ్మ ఇద్దరూ అందుకు సరే అన్నారు. ఆ వారంలోనే తొలి డోస్ ఇస్తూ వాడవలసిన మందులు, తినదగిన ఆహారం అన్నీ చెప్పారు.
ముగ్గురు సంతోషంగా ఇంటికి వచ్చారు. సావిత్రమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది.
దీప నువ్వు సుధని సొంత చెల్లి లా చూసుకుంటున్నావు. అందుకని ఒక విషయం ప్రస్తావిస్తాను. నువ్వు, మీ అమ్మ గారి తో కలిసి ఇక్కడికి పెర్మనెంట్ గా వచ్చేయ్. నలుగురం కలిసి ఉందాం. నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక చెల్లెలు అనుకుంటా అని చెప్పింది.
Friends · Telugu
సుధా దీపిక
Completed
|
Part 4 of 7
|
0 Likes
Part 4
2050 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)