Ratnesh:"అవును ప్రియ, మొన్న వీకెండ్ మా ఇంటికి డిన్నర్ కి పిలిచాం కదా, ఎందుకు రాలేదవు?"
Priya:"అవునా, మర్చిపోయాను...సారీ."
Ratnesh:"ప్రభా చాల సార్లు అనుకుంది."
Priya:"నా దగ్గర నీ వైఫ్ ప్రభా నంబర్ లేదు...ఒక్కసారి నీ ఫోన్ లో డయల్ చేసి ఇవ్వు, మాట్లాడతా."
Ratnesh:"ఇదిగో, డయల్ చేశా." ప్రియ వెంటనే ఫోన్ తీసుకుని బయటకి వెళ్లింది.
Prabha: "హై డార్లింగ్...ఏంటి ఈ రోజు వర్క్ మధ్యలో తలుచుకున్నావ్, అంతగా గుర్తొస్తున్నానా?"
Priya:"హలో ప్రభా, నేను ప్రియని...సారీ, రత్న ని ఫోన్ చేసి మీతో మాట్లాడాలని. మొన్న పీరియడ్స్ వచ్చి, అసౌకర్యంగా ఉండి రాలేకపోయాను. ఈ వీకెండ్ మా ఊరు వెళ్తున్నా...నాకు పెళ్ళిచూపులు ఉన్నాయి. ఆ పై వీకెండ్ తప్పక వస్తా."
Prabha: "ఓ సూపర్...అయితే పెళ్ళిచూపులు అయ్యాక ఆ విశేషాలు కూడా మీరు చెప్పచ్చు మనం కలిసినప్పుడు. ఇంతకి మీకేం ఇష్టం చెప్పండి, అవి చేస్తా."
Priya:"ప్రభా, ఏం స్పెషల్స్ అవసరం లేదు...ఏమైనా నాకు ఓకే. ఒక చిన్న రిక్వెస్ట్, అది మీరు అన్నట్టుగా గర్ల్స్ నైట్ అయిలా ప్లాన్ చేయండి."
Prabha: "ఓకే, అర్థం అయ్యింది...ష్యూర్, అలాగే చేద్దాం."
Priya:"ఓకే, బై ప్రభా."
Prabha: "బై."
Ratnesh:"ఫోన్ అయిందా... ఏమంటుంది ప్రభా?"
Priya:"గర్ల్స్ టాక్...చెప్పకూడదు...హె హే."
ఆ రోజు బానే అయింది...ఈవెనింగ్ ఇంటికి వచ్చా.
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story