నెక్స్ట్ డే ఈవెనింగ్ ఆంటీ దగ్గరికి వెళ్లాను. ఆంటీ నన్ను చూసి సడన్ గా అదీ మంగళవారం పూట వచ్చావేమిటి అని అడిగారు. ఆంటీ కి నేను మొదటినుండి ఒక సంవత్సరం పాటు ఈస్ట్రోజెన్ టాబ్లెట్స్ వేసుకోవడం గురించి చెప్పాను. ఆంటీ "లావణ్యా! నీలో ఇంతగా కోరిక బలపడిందని, టాబ్లెట్స్ వాడినట్లు తెలిస్తే మీ అమ్మ తట్టుకోలేదు తనకు ఏమీ చెప్పకు! అని డాక్టర్ గారికి ఫోన్ చేసి వివరంగా చెప్పింది. డాక్టర్ గారితో నా క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు, అమ్మ ఆంటీ కలిసి నన్ను ముస్తాబు చెయ్యటం దగ్గరనుండి అన్నీ దాచకుండా చెప్పేశారు. డాక్టర్ గారు ఏం చెప్పారో తెలీదు గానీ ఆంటీ నేను రేపు వాడిని తీసుకు వస్తా లెండి అంటూ ఫోన్ పెట్టేశారు. నాతో "రేపు లంచ్ టైం కి స్కూల్ కి వస్తా మనం విజయవాడ వెళ్లి డాక్టర్ గారిని కలిసి వద్దాం! అమ్మకు ఏమీ చెప్పనక్కరలేదు అన్నారు.
ఆ మరుసటి రోజు ఆంటీ స్కూల్ కి వచ్చి మా స్కూల్ ఫాదర్ కి చెప్పి పర్మిషన్ తీసుకున్నారు! అశోక్ తనూ కలిసి వచ్చారు! ఆంటీ అశోక్ తో మనం వెంటనే వచ్చెయ్యాలి త్వరగా పోనీయరా అన్నారు! అశోక్ చాలా బాగా డ్రైవ్ చేస్తాడు కార్. వెళ్లేసరికి డాక్టర్ గారు లంచ్ కి వెళ్ళకుండా కూర్చుని వెయిట్ చేస్తున్నారు! ముగ్గురినీ కూర్చొమ్మని చెప్పి నిన్నటి రిపోర్ట్స్ మళ్ళీ చూసి నా మేల్ ఎరెక్షన్ యెట్లా వుంటుంది అని అడిగారు! ఇదివరలో తెల్లవారు జామున ఫ్రీక్వెంట్ ఎరేక్షన్స్ ఉండేవి ఈ మధ్య ఉండటంలేదు అని చెప్పా ..... మరి నువ్వు మగాడిగా పర్ఫెక్ట్ గా ఉండాలంటే లేడీస్ డ్రెస్సెస్ వేసుకోవటం దగ్గర నుండి అన్నీ మానెయ్యాలి మానేస్తావా అని అడిగారు. కొంచెం ఇబ్బందిగా ఆంటీ వైపు చూసా! ఆంటీ కళ్ళతోనే వారించింది ... నేనున్నా అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది. డాక్టర్ గారితో "తను సెక్సువల్ ఐడెంటిటీ డిసార్డర్ తో సఫర్ అవుతున్నట్లుంది డాక్టర్! నెక్స్ట్ వీక్ లో వాళ్ళ డాడీ ని, మమ్మీ ని తీసుకువస్తా. కొంచెం మీరే కన్విన్సు చెయ్యండి! వాళ్ళ ఫాదర్ కి తెలియకుండా వచ్చాం మొన్న, ఇప్పుడు కూడా. మీరేమీ మాట్లాడకుండా సబ్జెక్టు చెప్పి సెక్స్ చేంజ్ కి ఏమైనా అవకాశముంటే చెప్పండి. వీడికి మాత్రం అదే ఆశ. ఈ తతంగం వీడికి వూహ వచ్చినప్పటినుండి జరుగుతోంది కాబట్టి వీడి మనసు మారే ఛాన్స్ లేదు డాక్టర్" అని చెప్పారు!
మీరు నాకు తెలుసు కాబట్టి, ఈ వయసులో తను ఎంత ఇబ్బంది పడతాడో గమనించాను! సో సెక్స్ చేంజ్ ఇస్ రైట్ స్టెప్ ఇన్ హిస్ కేస్" అంటూ వచ్చేముందు తనకు ఫోన్ చెయ్యమన్నారు! వెంటనే వచ్చెసాము.
అమ్మకు ఆంటీ ఈస్త్రొజెన్ గురించి చెప్పకుండా డాక్టర్ ఫోన్ చేసారు వదినా! నానీకి హార్మోన్ డెఫిషియన్సీ ఉందట. సో వైవాహిక జీవితానికి పనికిరాడట! మళ్ళీ రిపోర్ట్స్ చూసి చెప్పారు. అన్నయ్యనూ, నిన్నూ రమ్మన్నారు! అని అమ్మకు ఫోన్ చేసింది నా ముందే!! నేను ఏమీ తెలీనట్లు ఇంటికి వెళ్ళిపోయాను .... అమ్మ మాత్రం ఏం ఆలోచించిందో ఆంటీ తో "మీ అన్నయ్య ఈ సంగతి యెట్లా డీల్ చేస్తారో గమనించి చెప్దాం వదినా! అంటూ ఫోన్ చేసిందట!!
ఈలోపు నాకు ప్లస్ టూ రిజల్ట్స్ వచ్చేసాయి! నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను! అమ్మ డబల్ హ్యాపీ!! నాన్న కూడా నన్ను మెచ్చుకున్నారు! ఇక పైచదువులు గురించి ఆలోచించటం మొదలు పెట్టారు డాడీ! అశోక్ ఏదో దారిలో వెళ్తూ వచ్చినట్లు వస్తూ డాడీ తో మాట్లాడుతూ బెంగుళూరు లో మంచి హోటల్ కేటరింగ్ అండ్ మేనేజ్ మెంట్ చేయించండి! వీడికి రూం ప్రాబ్లం అయితే నా రూం లో ఉంటాడు! అంటూ సొల్యూషన్ కూడా వెంట పెట్టుకొచ్చాడు. నాన్న సరేనన్నారు. డిగ్రీ విత్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గ్రూప్ తీయిస్తాను అంటూ మాటిచ్చి వెళ్ళిపోయాడు.
అప్లికేషన్స్, అడ్మిషన్ అన్నీ నేను చూసుకుంటా ఆన్నాడు...... అన్నట్లే అన్నీ అశోక్ చూసుకున్నాడు ! బెంగుళూరు వెళ్ళటానికి ఇంకా మూడురోజులే! ఆంటీ నాన్న బ్యాంకు కి వెళ్ళగానే మూడు రోజులూ తన దగ్గరే ఉండాలని ఆర్డర్ వేసింది! అమ్మ ఈ మూడు రోజులూ ఇట్లా అయితే ఎలా వదినా నాక్కూడా ఏమీ తోచదు కదా అంటే "నువ్వూ రావాలి" వదినా అంది ఆంటీ!!
మరుసటి రోజు నాన్న బ్యాంకు కి వెళ్ళగానే అమ్మా, నేనూ ఆంటీ ఇంటికి వెళ్ళాం. ఆంటీ ఆ రోజు తనే దగ్గరుండి ముస్తాబు చేశారు. చిలకాకు పచ్చరంగు చెట్టినాడ్ సిల్క్ శారీ , మాచింగ్ బ్లౌస్, లాంగ్ విగ్, దానిలోకి మల్లెపువ్వులు, నగలు, చేతికి అరవంకీలు, నడుముకి వడ్డాణం అన్నీ పెట్టి నన్నూ, వైష్ణవీని కాసేపు కబుర్లు చెప్పుకోండి. మేము బయటకు వెళ్లివస్తాం అంటూ అమ్మను వెంటబెట్టుకుని బయటకు వెళ్లారు ఆంటీ. ఆంటీ వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అశోక్ వచ్చాడు. నాకు గుండె గుబిల్లుమంది. వైష్ణవి ముందు ఏమైనా ఆకతాయిగా ప్రవర్తిస్తాడేమోనని. మేము ఒక అరగంటాగి భోజనం చేశాం. నాకు పట్టు చీర నగలు బాగానే ఉన్నాయి కానీ వేసవి కాలమేమో కొంచెం అసౌకర్యం గా ఉండి వైష్ణవితో చెప్పాను. తను "నీ ఇష్టం కావాలంటే డ్రెస్ చేంజ్ చేసుకో లావణ్యా! అంది. నేను తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని నగలన్నీ తీసేసి చిన్న బాక్స్ లోకి సర్ది, డ్రెస్ విప్పి ఆంటీ ఎప్పుడైనా బాగా ఉక్కబోస్తే ఇవి కట్టుకోవచ్చు అని అక్కడ పెట్టిన ఆమె పాత కాటన్ చీర కట్టుకున్నా! అప్పుడు అనుకున్నా ఈ భోగం ఇంకా మూడు రోజులే! బెంగుళూరు లో కుదరదు కదా అనుకున్నా!
కాసేపటికి అమ్మా, ఆంటీ ఇద్దరూ వచ్చేసారు! వాళ్ళ చేతిలో యేవో పాకెట్స్! నాకు కూడా చూపించలేదు! ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాము అమ్మా, నేనూ! ఆ నైట్ మంగళూరు లో ఎం టెక్ చేస్తున్న దీపక్ అన్నయ్య వచ్చాడు! నెక్స్ట్ డే మార్నింగ్ అశోక్ దీపక్ తో కలిసి ఇంటికి వచ్చాడు! చాలా జెంటిల్ గా ఉన్నాడు ఏమీ తెలియనట్లే అరేయ్ నానీ బెంగుళూరు లో సరిగ్గా చదవకపోతే మీ డాడీ కి డైలీ కంప్లైంట్స్ ఉంటాయి జాగ్రత్త అంటూ ఆట పట్టించాడు. అమ్మా, నేనూ కూడా తను ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించేసరికి ఊపిరి పీల్చుకున్నాం. ఆ రెండు రోజులూ దీపక్ ఇంట్లో ఉండేసరికి ఒకటే అసౌకర్యం నాకు ..... ఏం చెయ్యగలను! ఆంటీ ని కలవటానికి కుదరలేదు!
నెక్స్ట్ డే ఈవెనింగ్ శేషాద్రికి అమ్మా, నాన్నా, నేనూ, అశోక్, దీపక్ కలిసి బెంగుళూరు బయలుదేరాం. దీపక్ బెంగుళూరు లో మాతో రెండు రోజులుండి నేను సెటిల్ అయ్యాక మంగళూరు కి, అమ్మానాన్న నాకు కావలసినవి ఏమైనా ఉన్నాయేమో చూసి త్రీ డేస్ తరువాత విజయవాడ కి రిజర్వేషన్ చేయించుకున్నారు. నెక్స్ట్ డే బెంగుళూరు వెళ్ళగానే అశోక్ ఉంటున్న అపార్ట్ మెంట్ కి వెళ్ళాం. ఆ అపార్ట్ మెంట్ ఆంటీ వాళ్ళ అన్నయ్య వాళ్ళది. వాళ్ళు అమెరికా లో ఉంటారు ..... ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఉండటానికి ఉపయోగిస్తారు. 3 బెడ్ రూం అపార్ట్ మెంట్. ఫుల్లీ ఫర్నిష్డ్ . అమ్మకు బాగా నచ్చింది. నాన్న కూడా సాటిస్ఫయ్ అయిపోయారు. ఆ మరుసటి రోజు అమ్మానాన్న, దీపక్, అశోక్ వెంట రాగా నేను కాలేజీ కి వెళ్లాను ... చాలా పెద్ద కాలేజీ అది. నాన్న కాలేజీ డీన్ తో మాట్లాడారు! అమ్మ, దీపక్ అశోక్ కి థాంక్స్ చెప్పారు. ఆ నైట్ కి దీపక్ మంగళూరు వెళ్ళిపోయాడు తనకు అమెరికన్ కంపెనీ ప్లేస్ మెంట్ కి ఇంటర్వ్యూ ఉందంటూ వెళ్ళిపోయాడు! డాడ్ తన ఫ్రెండ్ ఎవరో ఉంటే కలవటానికి హెబ్బల్ వెళ్ళారు. అమ్మ, నేను, అశోక్ మిగిలాము. అమ్మ ఏదో చెప్పబోతే అశోక్ "ఆంటీ మీకంటే, మా అమ్మ కంటే నేను బాగా చూస్తా! అమ్మ అంతా చెప్పింది. నాది బాధ్యత అంటూ ప్రామిస్ చేసాడు! అన్నీ బాగున్నాయ్, నాకు ఇంకేమీ కావలసిన అవసరం లేదు అని నిర్ణయించుకున్న తరువాత అమ్మా, నాన్న నన్ను కాలేజీ లో దింపి జాగ్రత్తలు చెప్పి అశోక్ కి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు . అశోక్ నేను ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాలి .. ఆలస్యం అవుతుందేమో ఇంటికి వెళ్లిపోగలవా అంటూ బస్సు నంబర్స్, ఎక్కడ దిగాలి అన్నీ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. కాలేజీ లో చాలా బాగా గడిచిపోయింది ..పరస్పర పరిచయాలతో! నేను గమనించిందేమిటంటే ఆ కాలేజీ లో అబ్బాయిలు చాలా తక్కువ! అమ్మాయిలే ఎక్కువ! ఇదేమైనా అశోక్ కావాలని చేశాడా అనిపించింది. నాకు నేనే సర్ది చెప్పుకున్నా తనేమైనా ఆంటీ అమ్మల్లా ఆలోచించగలడా అని. కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్లాను .. నా దగ్గరున్న స్పేర్ కీ తో డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లాను ... సమయం 6 గంటలు. స్నానం చేసి ఏం చెయ్యాలో తెలీక షార్ట్ వేసుకుని టీ షర్టు వేసుకున్నా! అమ్మ మార్నింగ్ వెళుతూ వండిన కూర ఉంటే అది వేసుకుని ఎలక్ట్రిక్ కుక్కర్ లో నాకూ అశోక్ కీ వండుకున్న అన్నం తినేసి టీవీ చూస్తున్నా! కాలింగ్ బెల్ మోగింది ... తలుపు తీసేసరికి అశొక్. లోపలి వచ్చి సారీ లేట్ అయ్యింది అన్నం తినేసావా వేరి గుడ్ అంటూ లోపలి వెళ్లి స్నానం చేసి వచ్చేసరికి తనకు అన్నం పెట్టాను! చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు . గత 5సంవత్సరాలనుండి ఒంటరి జీవితం అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళ మావయ్య వాళ్ళ అపార్ట్ మెంట్ పాడు చేసేస్తారని భయంతో తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాడట! తను భోజనం అయిన తరువాత నన్ను "లావణ్యా! అమ్మ నీకోసమని యేవో పాకెట్స్ ఇచ్చింది! మీ డాడ్ వాళ్ళు వెళ్ళాక ఇమ్మంది అంటూ పెద్ద పెద్ద పాకెట్స్ నాలుగు పట్టుకొచ్చి హాల్లో సోఫాలో వేసాడు ... అవి నన్ను ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టి అమ్మ తో వెళ్లి తీసుకు వచ్చిన పాకెట్స్. అందులో ఏమున్నాయో చూస్తే విజయవాడ కళానికేతన్ లో కొన్న 4 చీరలు, పెట్టి కోట్స్ , జాకెట్లు . 5 కాటన్ నైటీలు, 3 సల్వార్ కమీజ్ లు, అండర్ గార్మెంట్స్ ఉన్నాయి! అవన్నీ చూసిన తరువాత అశోక్ వైపు చూశాను. అమ్మ చెప్పింది వెధవ్వేషాలు వెయ్యకుండా నిన్ను పువ్వులా చూడమని అంటూ కన్ను గీటాడు! నీకేమీ భయం లేదు .... ఇక్కడికి ఎవరూ రారు! కాలేజీ లో మనమేమీ చెయ్యలేము కాబట్టి అక్కడ నానీవే! ఇంట్లో నీ ఇష్టం! లావణ్యా నువ్వు ఆడపిల్లవి కాబట్టి ఇంటి పనులూ వంట పనులూ అవన్నీ నీదే బాధ్యత అంటూ నవ్వి నా తల మీద మొట్టాడు. నేను సిగ్గు పడిపోయాను! నీ రూం లో పెట్టుకో! మా రిలేటీవ్స్ వచ్చేసారు ఎవ్వరూ రావద్దని మా ఫ్రెండ్స్ కి చెప్పేసాను! ఎవ్వరూ రారు .... అన్నాడు అశోక్! ఏమనాలో తెలియటంలేదు .... తన మీద ప్రేమ కలిగిన తొలి క్షణమది. నా భావాన్ని పలికించలేక పోతూ కేవలం థాంక్స్ మాత్రం చెప్పగలిగాను! ఇంతలో ఫోన్ మ్రోగింది! అవతల్నుండి ఆంటీ! నీకేఫోన్ అంటూ అశోక్ రిసీవర్ నాకిచ్చాడు! "లావణ్యా! యెట్లా ఉన్నావ్? పాకెట్స్ అశోక్ ఇచ్చాడా అంటూ అడిగారు! ఆంటీకి థాంక్స్ చెప్పాను ..... అది మనిల్లే! ఏం కావాలంటే ఆ డ్రెస్ వేసుకో ఏమైనా ఇబ్బందుంటే చెప్పు అంటూ కాసేపు మాట్లాడి పెట్టేసారు!
అశోక్ ఇప్పుడే వస్తా అంటూ బయటి నుండి లాక్ పెట్టుకుని వెళ్ళాడు! నేను నా బెడ్ రూం లోకి వెళ్లి బీరువా సర్దడానికి తలుపు తీద్దును కదా! అంతకు ముందే అందులో హాంగేర్ కు వ్రేలాడదీసిన చీరలు, పంజాబీలు ఉన్నాయి! వెంటనే అవి చూసాక తరువాత సర్దుకోవచ్చులే అనుకుంటూ పాడెడ్ బ్రా, పాంటి వేసుకుని, విగ్ పెట్టుకుని పైన నైటీలో పెట్టికోట్ వేసుకున్న తరువాత పింక్ కలర్ నైటీ వేసుకున్నాక కానీ నా అసంతృప్తి పోలేదు. లిప్ స్టిక్ వేసుకొని, కళ్ళకు కాటుక పెట్టుకొని, సన్నపాటి చెయిన్ వేసుకుని, కాళ్ళకు పట్టీలు పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతుండగా డోర్ ఓపెన్ చేసుకొని వచ్చాడు అశోక్ నన్ను చూసి వావ్ అంటూ లావణ్య! ఇవిగో అంటూ విరజాజి పూల దండ నా చేతికి ఇచ్చాడు! బెడ్ రూం లోకి వెళ్లి నా జడలో పెట్టుకున్నా ..... ! అద్దంలో నన్ను నేను పరీక్షగా చూసుకుంటుండగా రెండు చేతులు నన్ను చుట్టేశాయి!.... వెనక్కు తిరిగి చూస్తే అశోక్! నా కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తూ "ఐ లవ్ యు లావ్స్!" అంటూ తమకం గా అల్లుకుపోసాగాడు! గన్నవరం నుండి నన్ను బెంగుళూరు వరకు తీసుకు వచ్చి నన్ను నన్నుగా ఉండటానికి ఇంత కష్టపడ్డ అశోక్ అంటే నాకు కూడా ఆసమయంలో నాకు ప్రేమకలిగింది! తనకు సహకరించసాగాను! తను నాతో చెడ్డగా ప్రవర్తించలేదు కానీ తన కౌగిలిలోకి తీసుకుని ప్రేమగా హాల్లోకి తీసుకు వచ్చి సోఫాలో అట్లానే తన వళ్లో కూర్చుండబెట్టుకుని మురిపంగా చూడసాగాడు! "నేను ఎందరో అమ్మాయిలను చూసాను! కానీ ఎందుకో ఏ ఒక్కరూ నచ్చలేదు .... ఎందుకో నిన్ను గన్నవరం లో చూడగానే పడిపోయాను అంటూ నా చెక్కిలి పై ముద్దిచ్చాడు!" నేనూ తన ప్రేమను చవి చూస్తూ నా బిడియాన్ని వదిలేసిన విషయం కూడా గమనించుకోలేక తనతో ముచ్చట్లాడుతూ ఇద్దరం పరస్పర కౌగిలిలో కరిగిపోతూ ఎప్పుడు నిద్రలోనికి జారుకున్నామో తెలీదు! ఉదయం నిద్ర లేచిన వెంటనే పని మనిషి వచ్చే సమయానికి తయారైపోయి అశోక్ నన్ను కాలేజీ లో డ్రాప్ చేసాడు! ఆ రోజు నాకు కాలేజీ ఎంత త్వరగా అయిపోతుందా అంటూ ఎదురు చూసాను! కాలేజీ అయిపోయాక కాలేజీ దగ్గర నుండి బస్సు స్టాప్ కి వెళ్తుంటే మెడికల్ షాప్ కనిపించింది! అప్పుడు గుర్తుకొచ్చాయి "ఈస్ట్రోజెన్" టాబ్లెట్స్ .... 3 స్ట్రిప్స్ తీసుకున్నాను!
Discussion (0)