ఆనందిని లెగిన్స్ లో చూసి మహిళా ఉద్యోగినులు ఎవ్వరూ స్పందించలేదు. కారణం వాళ్ళంతా సజాతీయులే కావటం వల్ల. అయితే నందినిని చూసి వాళ్ళంతా ఓవ్ అంటూ పొగడటం మొదలు పెట్టారు. యు ఆర్ ఎ పర్ఫెక్ట్ ఉమెన్ స్ట్రక్చర్. అన్నారు. చుట్టూ చేరారు. నందిని యు ఆర్ వెరీ బ్యూటీఫుల్. అన్నారు. పార్టీ అడిగారు. అంతా సన్డే పిక్ నిక్ ప్లాన్ చేద్దాం అన్నారు. నందిని ఇప్పుడు తనకి స్వాతంత్రం ఉందనుకోవటం లేదు. ఆనందిని తనకు మెంటార్ గా అనుకుంటోంది. అందుకని ఆనంది ని అడగండి. ఆనంది ఒకే అంటే నేను సిద్ధం. లేక పోతే నో. అంది.
నందినిలో ఈ మార్పు మరీ రెండు రోజులలోనే అనేసరికి ఆనందికి నవ్వు వచ్చింది. ఒకే గర్ల్స్ మనం పిక్నిక్ కి వెడతాం. అంది. అంతే .. అందరూ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ లాగా కేరింతలు కొట్టారు. సీనియర్ మేనేజర్ వచ్చి ఏమిటి హడావుడి. అని అడిగాడు. సండే పిక్నిక్ కి ప్లాన్ చేస్తున్నాం సర్. మీరు మీ కుటుంబ సభ్యులతో రండి సార్. అన్నారు. మేనేజర్ కూడా ఒకే అన్నారు. ఇక అందరి ఉత్సాహాలకు హద్దు లేదు. ఆరోజు ఉదయం ఉన్న ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ అన్నీ పూర్తి చేసి మధ్యాహ్నానికి లంచ్ అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చారు ఆనంది, నందిని.
ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో సర్వెంట్ మెయిడ్స్ లో ఒకామె బట్టలు ఉతుకుతోంది. రెండో ఆమె ఇంటికి తడి గుడ్డ పెడుతోంది. వాళ్ళని చూసి నవ్వుతూ పలకరించింది ఆనంది. నందిని మాత్రం వాళ్ళతో అంత కలుపుగోలు గా ఉండటం లేదు. (సశేషం)
Office · Telugu
Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?
Completed
|
Part 6 of 14
|
0 Likes
Part 6
3390 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)