Office · Telugu

Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?

Completed | Part 8 of 14 | 0 Likes

Part 8

నందిని ఆనంది తో నువ్వు నన్ను వదినా, అంటావు, బేబీ, అంటావు, అమ్మాయ్ అంటావు . కానీ నిన్ను ఏమని పిలవాలో తెలియటం లేదు. అంది. మరదలా అని పిలు పిల్లా. అంది ఆనంది. అలా వదినా మరదళ్ళు ఇద్దరూ స్వర్ణాచారి దగ్గరకి వెళ్లారు. అది చూడటానికి ఆ ఏరియాలో చాలా చిన్న షాప్ కానీ అక్కడ రద్దీ చాలా ఎక్కువ. హైటెక్ సిటీ ఏరియాలో ఉండే ధనిక మహిళల దగ్గర నుంచి మధ్య తరగతి మహిళల వరకు అక్కడే ఉంటారు. అతని పేరు ఎవరికీ తెలియదు. అందరూ స్వర్ణాచారి అనే పిలుస్తారు. అక్కడ ప్రతి రోజూ బంగారం లక్షలలో ఒక్కోసారి ఒక కోటి పైగానే అమ్ముడవుతుంది. పదిమందికి పైగానే అసిస్టంట్ లు ఉన్నారు అతనికి. ఒకతను ఏంకావాలో తెలుసుకుని ముక్కు,, రెండు చెవులకు గన్ తో రంధ్రాలు చేశాడు. అల్లాగే నాలుగు ముక్కుపుడకలు రెండు జతలు studs, రెండు జతలు drops కొన్నారు. దారిలో శారీ షోరూం కి వెళ్ళి కొన్ని కాటన్, షిఫాన్, జార్జెట్, కోటా శారీస్, వాటికి తగిన పెట్టి కోట్ లు, రెడీమేడ్ streachable బ్లౌజులు వగైరా వగైరా కొన్నారు. తరువాత నెమ్మదిగా కూరగాయలు, పూలు, పళ్ళు కొనుక్కుని అపార్ట్ మెంట్ కి చేరుకున్నారు. అక్కడ పంకజం వీళ్ళ కోసం ఎదురు చూస్తోంది. వాళ్ళు రాగానే నందినమ్మ నీకు చీర కట్టటం నేర్పటానికి వచ్చినాను. అంది. అలాగే అని కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యింది. ఆ తరువాత ఆనంది ఈ పూటకి నేను వంట చేస్తాను గాని నువ్వు ఆ చీర సంగతేమిటో చూడు పాపా. అంది. నందిని మౌనంగా తలూపి తన గదిలోకి వెళ్ళింది. అక్కడ మళ్ళీ ఉదయం లాగా తన పాంటీ, బ్రా లలో నిలబడింది. పంకజం అజంతా శిల్పసుందరి లా .. ఏలోరా నాట్యమంజరిలా అంటూ పాటఎత్తుకుంది.
ఆ తరువాత లైట్ వేయిట్ షిఫాన్ చీర కట్టుకోవటం నేర్పింది. నందిని ఇదివరలో అవటానికి క్రాస్ డ్రస్సరే కానీ ఎప్పుడూ చుడీదార్ లే కట్టటం అలవాటు. చీరలు ఎప్పుడు ట్రై చెయ్యలేదు. కనుక ఇప్పుడు కట్టటానికి ఒక గంట పట్టింది. రేపు పిక్నిక్ కనుక మళ్ళీ నెక్స్ట్ శారీ క్లాస్ రెండు రోజుల తరువాతే అని చెప్పింది పంకజం. పంకజానికి థాంక్స్ చెప్పి తెచ్చిన మల్లె పూల లో ఒక రెండు మూరలు పంకజానికి, రెండు మూరలు రోజాకి ఇమ్మని ఇచ్చింది నందిని. పంకజం ముఖం మతాబు లాగా వెలిగిపోయింది. థాంక్స్ చెప్పి పంకజం వెళ్ళి పోయింది. అది చూసిన ఆనంది అమ్మాయిగారికి ఇలా చెప్పితే అల్లా వచ్చేస్తున్నాయి విద్యలు. అని చెవిలో చెబుతూ నందిని కుడి చెవిని మెత్తగా కొరికింది. నందినికి గుండెలో ఎక్కడో ఆనందం పొంగి పొరలింది. వెంటనే ఆనంది చేతిని ఒకసారి పట్టుకుంది. అప్పుడు శారీలో ఉన్న నందినిని చూడగానే ఆనందికి ముచ్చట వేసింది. ఆ తరువాత ఇద్దరూ డిన్నరు చేశారు. ఒక మంచి క్లాస్ హోటల్ లో మీల్స్ లాగా చాలా వెరైటీస్ చేసింది. చాలా ఫాస్ట్ గా చేసింది ఆనంది. అన్ని పదార్థాలు చాలా టేస్టీ గా ఉన్నాయి. ఆనంది లా వండటం నేర్చుకోవాలి అనుకుంది నందిని. ఆ తరువాత ఇద్దరూ నైటీలలోకి మారారు. తలలు చక్కగా దువ్వుకుని ముడి వేసుకుని తెచ్చిన మల్లెపూలు తలలో పెట్టుకున్నారు. ఆడవాళ్ళు పూలు ఎందుకు పెట్టుకుంటారు అనే విషయాన్ని ఆనంది ఇలా చెప్పింది. స్త్రీలు తలలో పెట్టుకునే పూల సుగంధం వాళ్ళకి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని ఇస్తుందట. పగలంతా చేసిన పని వత్తిడి నుంచి రిలీఫ్ ఇస్తుందట. ఆ తరువాత ఇదిగో మరదలా! అని పిలిచింది నందిని. చెప్పొదినా, సాయంత్రం నువ్వు నీ గురించి ఏదో చెబుతానంటివి కదమ్మా. అంది. అవును కదా . చెబుతా విను. అంటూ తన గురించి చెప్పటం మొదలు పెట్టింది.
నా తల్లి, తండ్రులు నా చిన్నతనం లోనే చనిపోయారు. నేను మా మేనమామ గారి ఇంట్లో పెరిగాను. అయితే నాకు మా నాన్న నుంచి వచ్చిన ఒక మంచి ఇల్లు, కొంత పొలం ఉన్నాయి. వాటికోసమే మా మేనమామ వాళ్ళు నన్ను చేర తీశారు. నా పదకొండు ఏళ్ల వయస్సులో పెద్దమనిషినయ్యాను. పండగ చేశామని పించారు. స్కూల్ లో లెక్కల మాస్టారు, సైన్స్ మాస్టారు నా భుజం మీద చెయ్యి వెయ్యకుండా ఏ రోజూ పాఠం చెప్పేవారు కాదు. నాకు ఏదో అర్థం అయినా కొంచెం అటు ఇటు తప్పించుకుంటూ ఎలాగో టెన్త్ పరీక్షలలో జిల్లా ఫస్ట్ వచ్చాను. అదే సమయం లో ఇంట్లో అటు మేనమామ, ఇటు మేన బావ ఇద్దరూ నన్ను ఎక్కడ దొరికితే అక్కడ తడుముతూ ఉండే వారు. నాకు ఇటువంటి అనుభవాలతోనే కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి అయ్యింది. ఈ లోపల మా బావను చేసుకోమని నన్ను బాగా వత్తిడి చేసే వాళ్ళు. నేను ఆ మాట, ఈ మాట చెప్పి తప్పించుకునే దాన్ని. నా పొలం మీద వచ్చే ఆదాయం తో ఇంటిల్లిపాది తిని నెమ్మదిగా మంచి స్థితిమంతులు కూడా అయ్యారు మా మామయ్యా కుటుంబం. అయినా ఒక మంచి రోజు నా చేత బలవంతంగా నా పొలం రాయించేసుకున్నారు. ఆరోజు రాత్రి మా బావ బాగా తాగేసి వచ్చి వద్దంటున్నా నన్ను అనుభవించాడు. ఇంక మరునాడు నా ఇల్లు కూడా వాళ్ళు వ్రాయించుకుందాం అనుకున్నారు. ఆ మాటలు విని నేను రాత్రికి రాత్రి నా సర్టిఫికెట్స్, కొద్ది పాటి బట్టలు, మా అమ్మ నాకు ఇచ్చిన నగల బాంకు లాకర్ కీ, ఇంటి దస్తావేజులు పట్టుకుని రాత్రికి రాత్రి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ నా ఇంజనీరింగ్ ఫ్రండ్స్ సాయంతో వర్కింగ్ వుమన్స్ హాస్టల్ లో చేరి ఉద్యోగ ప్రయత్నాలు చేసి రెండు మూడు కంపెనీలలో ఉద్యోగం చేసి కార్పొరేట్ ప్రపంచం లో ఉండే లోతు పాతులు వీలైనంత వరకూ అర్థం చేసుకుంటూ ఇదిగో నీతో ఇలా సహవాసం చేస్తున్నా తల్లీ." అంది. నా అదృష్టం బాగుండి నందిని అనే ఒక మంచి ఆడపిల్ల నాకు సహవాసిగా ఈ అపార్ట్మెంట్ లో దొరికింది. అలా కాక ఆ నందు గాడు కనుక ఒక రేపిస్ట్ అయితే నేను ఈ పాటికి ఎక్కడ ఉండేదాననో? అంది. ఆనంది కథ విన్న నందినికి ఏడుపు ఆగలేదు. పేరుకి ఆనంది కానీ ఆమెకు ఇంతవరకు సుఖం లేదు. నందిని ఒక నిశ్చయానికి వచ్చింది. "నిన్ను మరదలా అనటం బాగా లేదు. నిన్ను నేను యువరాణి అంటాను. నాకు ఆజ్ఞను ఇచ్చే రాణివి నువ్వే. నిన్ను ఏ కష్టం రాకుండా నే చూసుకుంటా." అంది. ఆనంది నిండుగా నవ్వి నందినికి దగ్గరగా జరిగి అలాగే వదినా. అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఇక రేపు ఉదయం మనం పిక్ నిక్ కి బయల్దేరేందుకు పొద్దున్నే లేవాలి. కనుక త్వరగా పడుకుందాం. అని చెప్పింది. (సశేషం)

3397 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login