రాత్రి తెల్లవార్లు నందిని అనందిని గురించే ఆలోచిస్తోంది. నా రాణి కి చైల్డ్ అబ్యూజ్ అంటే నేను తట్టుకోలేకుండా ఉన్నాను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని చంపేయాలి అనిపిస్తోంది. పచ్చని పసి జీవితాలను మొగ్గలోనే తుంచేసే కామాంధులు అంతటా విస్తరించి ఉన్నారు. వీళ్ళకి అంతం లేదా? వీళ్ళను దారిలో పెట్టేవారే లేరా? అనుకుంటూ పక్క మీద దొరలుతోంది నందిని. తెల్లవారు జామున ఆనంది నెమ్మదిగా నందిని భుజం మీద తట్టి లేపుతూ "ఉందమ్మా ఆ పసి జీవితాలను తుంచేసే కామాంధులని దారిలో పెట్టే వ్యవస్థ ఉంది, దాని గురించి మనం తరువాత ఆలోచిద్దాం. ముందు నువ్వు లేచి రెడీ అవ్వాలి. మనం ఈ రోజు పిక్నిక్ కి వేడుతున్నాం కదా. లే బేబీ!" అంటూ లేపింది. అంటే తను తనలో అనుకుంటున్నాను అనుకుంటూ నిద్దట్లో కలవరిస్తోందన్న మాట. అని తెలుసుకుని సిగ్గు పడి అంతలోనే తల వెనుక వైపు అరచేతి వేళ్ళతో ఒక సారి కొట్టుకుంది నందిని. ఆ తర్వాత " త్వరగా బ్రష్ చేసుకుని నీ రాణి గారికి కాఫీ పెట్టమ్మా" అంటూ దీర్ఘం తీస్తూ బుగ్గమీద గిల్లి తను బ్రష్ చేసుకోడానికి ముందుకు కదిలింది. "అలాగే యువరాణి! మీ ఆజ్ఞని ఈ సేవకురాలుశిరసా వహిస్తుంది." అంటూ తను కూడా బ్రష్ చేసుకోవటానికి కదిలింది. ఇద్దరూ ఫ్రెష్ అప్ అయ్యాకా కాఫీ పెట్టానికి సిద్ధమైంది నందిని. కాఫీ పెడుతూ ఇవాళ "మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి రాణి గారు?" అని అడిగింది. "నా ప్రియమైన చెలీ! ఈ రోజు పిక్నిక్ ఇక్కడినుంచి 40 కిలో మీటర్ల దూరంలో మన executive lead శాలిని వాళ్ళ farm house లో నట. అది 300 ఎకరాల స్థలమట. అందులో ద్రాక్ష తోటలు, సపోటా తోటలు, సంత్రా తోటలు ఇలా ఉన్నాయిట. అలాగే ఒక మంచి కమ్యూనిటీ హాల్, అలాగే మ్యాంగో గ్రూవ్ మధ్యలో ఓపెన్ మీటింగ్ ప్లేస్, మంచి ప్లే గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, బాట్మెంటన్ కోర్టు, ఇండోర్ గేమ్స్ ఆడటానికి ప్లేస్ ఇలా చాలా ఉన్నాయి.
స్వప్న, సింధు ఇద్దరూ ఫుడ్ కోర్టు చూసుకుంటారు . లైలా, జాస్మిన్ ఇద్దరూ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ చూస్తారు. రఘు, విశాల, లక్ష్మణ్, సురేష్, పద్మ, వీళ్ళు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చూస్తారు. లాగిస్టిక్స్ ప్లానింగ్ అంతా మన కాష్ డిపార్ట్మెంట్ వర్మ గారి టీమ్ చూస్తారు. మొత్తం 50 మంది ఫామిలీలు వస్తున్నారు. అంటే షుమారు 120 నుంచి 140 మధ్యలో ఉంటారు అందరూ కలిసి. అలాగే కొంతమంది సెక్యూరిటీ పర్సన్స్ కూడా వస్తారు. వాళ్ళో 30 మంది ఉంటారు. అలాగే కాంటీన్ స్టాఫ్ కూడా వస్తున్నారు." అని మొత్తం అరేంజ్మెంట్స్ పిక్చర్ ఇచ్చేసింది ఆనంది. "అయితే రాణి గారు, మనం ఏం చెయ్యాలి?" అని అడిగింది. . మనకి సంగీత, నృత్య కార్యక్రమాల నిర్వహణ ఇచ్చారు. మనతో పాటు మంజుల, గీత, సువర్ణ,, సతీష్, హరి, శంకర్ వీళ్ళంతా ఉంటారు. మన స్టాఫ్ లో కొంతమంది ఇన్స్ట్రుమెంటలిస్ట్ లు కూడా ఉన్నారు. చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. ఈవెంట్స్ షెడ్యూల్ కూడా రెడీ గా ఉంది." అని చెప్పింది ఆనంది. రాణి గారు ఒక చిన్న విన్నపం అంటూ నాటక పక్కీలో అడిగింది నందిని. ఏమది బేల! అని అడిగింది ఆనంది. . "మనతో పాటు మన కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకుని పోదాం."
ఎవరా సభ్యులు అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూస్తుంటే ఇంకెవరు? రోజా, పంకజం వాళ్ళకి నిన్ననే చెప్పాను మనతో రమ్మని. అంది నందిని. మెచ్చుకోలుగా చూసి బహు లెస్స పలికితివి అబలా అటులే కానిమ్ము. అందునా పంకజం నీకు మిక్కిలి సహాయం చేయకలదు. మరో విషయం నువ్వు ఒక రెండు చీరలు, అనార్కలి డ్రెస్, రెండు చూడి దార్లు, ఒక పాటియాలా డ్రస్, ఇలా ఏడెనిమిది డ్రెస్సులు తీసుకురా. అక్కడ ఆడవాళ్ళందరికీ అక్క సోఫిస్ట్కేటెడ్ హట్ రూమ్స్ ఇస్తున్నారట. అని చెప్పింది. తరువాత నెమ్మదిగా తలంటు పోసుకుని కురులార బెట్టుకుంటూండగా పంకజం, రోజా వచ్చారు. (సశేషం)
Office · Telugu
Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?
Completed
|
Part 9 of 14
|
0 Likes
Part 9
3397 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)