ఇంటికి వెళ్ళగానే నేను చేసిన పని "ఇంటిని శుభ్రం చేసి (పని మనిషి ఉన్నా) అశోక్ కి ఇష్టమైన గుత్తి వంకాయ కూర, సాంబారు తయారు చేసి, ఎలక్ట్రిక్ కుక్కర్ లో బియ్యం కడిగి పెట్టి, స్నానం చేసి నాకు నచ్చిన కాటన్ చీర (వైట్ కలర్ మీద పింక్ ఫ్లవర్స్ డిజైన్) లోకి మారిపోయి, కొన్ని సింపుల్ గా ఉండే గాజులూ, చెయిన్ రాత్రి అశోక్ తెచ్చిన విరజాజి పూలు కొన్ని మిగిలి ఉంటే అవి ఫ్రిజ్ లో పెట్టిన విషయం గుర్తుకు వచ్చి వాటిని తీసుకొని జడలో పెట్టుకుని అశోక్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రియుని కోసం విరహంతో వేచి చూసే అభిసారిక లా ఉంది నా పరిస్థితి ..... ఈ లోపు అమ్మ, నాన్న మాట్లాడారు ఫోన్ లో. వైష్ణవి ఆంటీ దీపక్ లకు నేనే ఫోన్ చేసి మాట్లాడాను. ఆంటీ "నా కొడుకు బాగా చూసుకుంటున్నాడా! అంటూ జోక్ గా మాట్లాడుతూ ఉంటే చెప్పేద్దామనిపించింది. కానీ సిగ్గు వేసి చెప్పకుండా మిన్నకున్నాను ...
ఆ నైట్ అశోక్ కొంచెం లేట్ గా వచ్చాడు .... నన్ను చూడగానే చిరునవ్వుతో "నాకోసం ఈ ముద్ద మందారం" వెయిట్ చేస్తున్నదంటే ఎప్పుడో వచ్చేద్దును" అ ఇంటర్వ్యూ లన్నీ మానేసి ... అంటూ బాత్రూం లోకి దూరి స్నానం చేసి వచ్చేసరికి తనకూ నాకూ భోజనం డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను.... నా ఏర్పాట్లు చూసి అశోక్ నవ్వేసాడు ..... కానీ ఆ పదార్ధాల రుచి చూడగానే "మా అమ్మ నేర్పింది కదూ! మా అమ్మ యెట్లా చేస్తుందో అలానే చేశావ్ అంటూ ప్రశంసగా చూసాడు ..... నాకు ప్రేమగా తను కలుపుకున్న అన్నం నుండి గోరు ముద్దలు తినిపించసాగాడు! గత రెండురోజుల నుండీ నేను అనుభవిస్తున్న ఈ ఆడతనం నాకు ఎన్నో సిగ్గులనూ, హొయలనూ నేర్పుతోంది .... వీటితో నా తనువు పులకరిస్తోంది..... కాసేపు అశోక్ తో కాలక్షేపం చేసి కాలేజీ వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకున్న తరువాత నిద్రకు ఉపక్రమిస్తూ ఈస్ట్రోజెన్ టాబ్లెట్ వేసుకున్నాను ..... రేపు నేను చవిచూడబోయే ఫలితమేమైనా అశోక్ ప్రేమ ముందూ, ఆంటీ మమత ముందూ అది ఏదైనా నాకు చిన్నగానే అనిపించింది ..... అమ్మ ఇచ్చే మోరల్ సపోర్ట్ ఎలానూ ఉంది !
రోజులు గడుస్తున్నాయి ..... అశోక్ కి ఒరాకిల్ కంపెనీ లో జాబు వచ్చింది ...... ఆ రోజు నన్ను కారులో బెంగుళూరు అంతా తిప్పేసాడు ..... మంచి హోటల్ కి కూడా వెళ్ళాము .... చెప్పలేదు కదూ ..... తనకు ఉద్యోగం వచ్చినప్పుడు నాకు ఇష్టమని చందేరి పట్టు చీర కొన్నాడు అశోక్ ..... అది కట్టుకుని రమ్మని తనతో! నేను ఆంటీ తో కూడా ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు ..... నాకు భయం బాబూ అన్నాసరే ఒప్పుకోకుండా ఎవ్వరూ గుర్తు పట్టరు ..... నువ్వు మగవాడినని నువ్వు అనుకుంటున్నావేమో ..... అంటూ నన్ను రెచ్చగొట్టి ... ధైర్యం చెప్పి బయటకు తీసుకు వెళ్ళాడు ..... నేను మొదట భయపడ్డా తరువాత నా ప్రక్కనుండి వెళ్ళే వాళ్ళూ ఎదురుగా వచ్చేవాళ్ళూ అందరూ కాజువల్ గా వెళ్లిపోతుంటే నేను మామూలు గా ధైర్యం తెచ్చుకోసాగాను! ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాను అశోక్ తో .... రోజులన్నీ ఇట్లానే ఉండిపోతే ఎంత బాగుండు అనుకున్నా ....!
అక్కడినుండి మొదలు అశోక్ ప్రతీ వీకెండ్ కి ఎక్కడికో ఒకచోటికి తీసుకు వెళ్ళడం...... తను నా ప్రక్కన ఉంటె నాలో ఉన్న ఆడతనం రోజు రోజుకీ పెరుగుతోంది ..... ఒక రోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరికి మా ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఉంది .... ఎవరా అని చూస్తే ఆంటీ! ఆంటీ ని చూసేసరికి ఆనందం ..... ఏడుపూ!! ఆంటీ ని కౌగలించుకుని ఏడ్చేసాను! ఆంటీ నీకోసమే ఏం చేస్తున్నావో! యెట్లా ఉన్నావో అని ఒకటే ధ్యాస అంటూ అశోక్ యెట్లా ఉంటున్నాడు నీతో .... అని అడిగేసరికి మనసులో ఏమీ దాచుకోకుండా అన్నీ చెప్పేసాను! ఆంటీ ముఖంలో ఒక రకమైన తృప్తి కనిపించింది! అశోక్ ఫోన్ చేసి వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పాడు ..... ఆంటీ ని అట్లానే కూర్చొమ్మని చెప్పి నేను నైటీ లోకి మారిపోయి చకచకా వంట పూర్తి చేసి .... స్నానం చేసి సింపుల్ గా లైట్ బ్లూ కలర్ హ్యాండ్ లూం శారీ కట్టుకుని ఆమెతో కబుర్లు చెబుతూ భోజనం పూర్తి చేశాము!! తరువాత హాల్లో టీవీ చూస్తూ కబుర్లు చెప్పసాగాను ..... ఇంతలో ఆంటీ లావణ్యా! నీ కడుపు నొప్పి యెట్లా ఉంది .... ఇంకా వస్తుందా అని అడిగారు. నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు అయ్యింది మూడుసార్లు నొప్పి వచ్చింది ఆంటీ అని చెప్పా! మరి ఏం చేసావు అని అడిగితే మీరు ఒక నైట్ పంపించారు కదా వాచ్ మాన్ తో ఆ పామ్ప్రిన్ మాక్స్ టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోయింది అని చెప్పాను! అప్పుడు చెప్పారు ఆంటీ. విజయవాడ డాక్టర్ గారు ఆ టాబ్లెట్స్ వాడడం వాళ్ళ ఫిమేల్ హార్మోన్స్ డెవలప్ అయ్యి నాలో ఉన్న మగతనం స్థానంలో ఆడతనం డెవలప్ అయ్యిందని .... అప్పుడు చెప్పా ఆంటీ తో టాబ్లెట్స్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మొదలుపెట్టానని! ఆంటీ నాతో "సొంత వైద్యాలు మానెయ్యి .... అమ్మ తో రేపు మాట్లాడుతా .... ఏం చెయ్యాలో ఆలోచిద్దాం" అని చెప్పారు! సరేనన్నా. ఆ నెక్స్ట్ డే అమ్మ తో ఆంటీ మాట్లాడారు .... అమ్మ అటునుండి నాన్న ఏమంటారో, దీపక్ ఏం చేస్తాడో అని భయపడిందట...! ఆంటీ "వదినా ... నేను చూసుకుంటా.... రేపు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా .. ఏమంటారో చూసి అప్పుడు ఆలోచిద్దాం అని అన్నారు! శనివారం మాకు సెలవు . ఆరోజు ఆంటీ నన్ను బెంగుళూరు అపోలో హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు ..... అక్కడి డాక్టర్స్ కి నా కోరిక, నేను మింగిన టాబ్లెట్స్ గురించి చెప్తూ నెల నెలా వచ్చే నొప్పి గురించీ, దాని నివారణ కోసం వాడే మెన్సస్ పెయిన్ తగ్గటానికి వాడే టాబ్లెట్స్ వాడితే పైన తగ్గిపోవటం వరకూ అన్నీ చెప్పేశారు ఆంటీ! వాళ్ళు కొన్ని టెస్ట్స్ వ్రాసారు .... అక్కడే టెస్ట్స్ కండక్ట్ చేసారు .... చివరికి నాకు సెక్స్ చేంజ్ ఆపరేషన్ బెటర్ సొల్యూషన్ అని తేల్చేశారు. ఆంటీ చీఫ్ డాక్టర్ గారితో మా నాన్న అన్నల గురించి చెప్పి వాళ్లకు యెట్లా చెప్పాలో తెలియటం లేదని అంటే ఆయన మేము చూసుకుంటాం ... మేము కౌన్సిలింగ్ ఇస్తాము అని చెప్పారు. ఆంటీ ఒక వేళ ఏ హాస్పిటల్ కైనా వెళ్తే ప్రత్యామ్నాయ మార్గామేమైనా దొరుకుతుందా అంటే సెక్స్ చేంజ్ అవసరం లేకుండా ఏమైనా చెయ్యగలరా! అని అడిగారు. దానికి డాక్టర్ లాభం లేదు ..... హార్మోన్స్ బాగా డెవలప్ అయ్యిపోయాయి ..... మగతనానికి సంబంధించిన ఎరెక్షన్స్ కూడా లేవు అంటూ ఇంకా లాభం లేదు అన్నారు! హార్మోన్ ఇంజెక్షన్స్ వాడి బ్రెస్ట్ అవీ పెరిగేలా హార్మోన్ థెరపీ మొదలుపెడితే నాలో చక్కని స్త్రీత్వం వస్తుందని చెప్పారు! ఇక ఇంటికి వచ్చాక ఆంటీ ముఖం లో ఒకటే ఆనందం ... నాకేమో అయోమయం ....!! నన్ను లేచి ఫ్రెష్ అయ్యి వంట చెయ్యమని చెప్పి ఆవిడేమో అమ్మకు ఫోన్ చేసి బాల్కనీ లో కూర్చుని చాలా సేపు ఏవేవో మాట్లాడింది ... అశోక్ వచ్చాక అందరమూ భోజనం చేశాము.... ఆంటీ అశోక్ తో లావణ్యా నేనూ ఎల్లుండి విజయవాడ వెళ్ళాలి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి అన్నారు! అశోక్ తనకి దసరా సెలవులు చాలా కాలం ఉంది కదా అంటే ..... తన మొఖం లో ఏదో అసంతృప్తి ! ఆంటీ నవ్వుతూ లావణ్యను ఎక్కడికీ తీసుకు వెళ్ళనులేరా ! కొంచెం మెడికల్ అడ్వైస్ కి అంతే అన్నారు! తరువాతి రోజు ఆంటీ నాన్నకు అశోక్ తో ఫోన్ చేయించి "నానీకి కడుపు నొప్పి తరచూ వచ్చేస్తుంది అంకుల్ .... ఎలానూ అమ్మ ఇక్కడే ఉంది కదా నానీని ఆమెతో ఫ్లైట్ లో పంపుతున్నాను .... కంగారేమీ లేదు! కాలేజీ లో పర్మిషన్ తీసుకున్నాము. అక్కడేదైనా మంచి హాస్పిటల్ కి తీసుకు వెళ్లి చూపించండి అని చెప్పించారు. తరువాతి రోజు ఆంటీ నేను గన్నవరం బయలుదేరాం.
ఆంటీ నేనూ గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకునేసరికి అశోక్ వాళ్ళ డాడ్(ముందు రోజే గన్నవరం వచ్చారట), అమ్మానాన్న, వైష్ణవి వచ్చారు ..... నాన్న ముఖం లో ఆదుర్దా! అమ్మకేమో కంగారు ఏం జరుగబోతుందో అని! ఆంటీ నాన్నతో "అన్నయ్య గారూ! కంగారు పడాల్సిందేమీ లేదు ... అప్పుడప్పుడూ భరించలేనంతగా స్టమక్ పెయిన్ వస్తోందట! అశోక్ గాడికేమో ఒకటే కంగారు! నేను అక్కడే చూపిస్తానన్నా నానీ ఏమో అమ్మానాన్న దగ్గరగా ఉంటారు కదా ఆంటీ విజయవాడ వెళ్లిపోదాం అన్నాడు! ఎలాగూ నేను వస్తున్నా కదా అని తీసుకు వచ్చేశా!" అన్నారు! నాన్న "చెల్లెమ్మా చాలా థాంక్స్ రా! అంటూ నా వైపు తిరిగి రేపు మీ అమ్మా నువ్వూ మన బ్యాంకు పానెల్ డాక్టర్ ఉంటారు! అక్కడికి వెళితే టెస్ట్స్ చేస్తా అన్నారు! మార్నింగ్ రెడీ గా ఉండరా నానీ! అన్నారు.... సరేనని తల ఊపా! ఆంటీ వైపు చూశాను! ఆమె చిన్నగా నవ్వి నాలుక ఊపారు ఎవ్వరూ చూడకుండా!
నెక్స్ట్ డే విజయవాడ బయలుదేరాం! ఆంటీ ని కూడా తీసుకు వెళ్ళమన్నారు నాన్న ఆమె ఖాళీగా ఉంటే! ఆంటీ వచ్చారు! తీరా నాన్న చెప్పిన డాక్టర్ అంతకు ముందు తీసుకు వెళ్ళిన డాక్టర్ ఒక్కరే! నేననుకుంటూ ఉంటా ఇప్పుడు! ఆంటీ కి అది తెలుసేమోనని! ఆంటీ నేను మళ్ళీ ఈస్త్రొజెన్ టాబ్లెట్స్ వాడడం అన్నీ చెప్పారు! డాక్టర్ గారికి నాన్న, అశోక్ విషయం చెప్పారు! ఎలాగైనా సమస్యను పరిష్కరించాల్సిందే అని డాక్టర్ గారికి చెప్పారు! డాక్టర్ గారు "ప్రసాద్ గారికి అబద్ధం చెప్పడం తప్పు అని తెలుసు .. కానీ నిజం చెబితే "మీ ఇద్దరికీ ప్రమాదం" మీరు కానీ, ప్రసాద్ గారు కానీ బాధ పడకుండా సమస్యలు తీర్చాల్సిందే ..... సరే నేను తరువాత చెప్తా కంగారు పడొద్దు అన్నారు!
Discussion (0)