Family · Telugu

ఒక యువరాణి కథ

Completed | Part 7 of 9 | 0 Likes

Part 7

వారంలో అశోక్ కంపెనీ టూర్ మీద అమెరికా వెళ్ళాడు. 6 నెలలు ఉండాల్సి వస్తుంది అని చెప్పాడు. నేను కూడా మేల్ టు ఫిమేల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో ఉండటం వల్ల తనముందు ఇబ్బంది ఉండదు ఇదీ మన మంచికే అనుకున్నాను. ఆంటీ కూడా వైష్ణవి కాలేజీ రీ ఓపెన్ అవుతుంది కాబట్టి వెళ్లిపోవాలి అని తను కూడా బయలుదేరారు. అమ్మ బలవంతం మీద ఒక వారం తరువాత బయలుదేరారు.

అమ్మ ఆంటీ తో "వదినా! నువ్వు లేకపోతే నానీ విషయం యెట్లా హేండిల్ చేసేదాన్నో నాకే తెలీదు. ఆ భగవంతుడు నానీ పాలిట దేవతలా పంపాడు నిన్ను.... అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆంటీ "నా ఋణం తీర్చుకునే మార్గం సమయం వచ్చినప్పుడు చెప్తా కానీ ముందు ఏడ్చేసి నా ఋణం తీర్చేసుకోకు అంటూ వాతావరణాన్ని తేలికపరిచేసింది ఆంటీ. ఆ నైట్ నుండి నేను డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడటం మొదలుపెట్టాను. మెడిసిన్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేది. శరీరంలో వెంటనే మార్పులేమీ కనపడలేదు గానీ ఏదో ఇబ్బంది గా ఉండేది. ఈ మధ్యలో ఆంటీ ఇంటి దగ్గరే కాబట్టి కాటన్ నైటీలే వాడు లావణ్యా ఎందుకంటే శరీరంలో ఏమైనా మార్పులు వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు అనడంతో నైటీలే వాడటం అలవాటు చేసుకున్నా. కానీ డే టైం లో అప్పుడప్పుడూ చీరలు కట్టుకునేదాన్ని (?) .. ఆంటీ వైష్ణవి గన్నవరం వెళ్ళిపోయారు. నాన్న ఒక 15రోజులు మెడికల్ లీవ్ పెట్టి వచ్చి మాకు తోడుగా ఉన్నారు. ఆసమయంలో నాన్న నాకిచ్చిన మనోధైర్యం నేనిప్పటికీ మర్చిపోలేను. నాన్న ముందు ఆడపిల్లలా చీరకట్టుకుని తిరుగుతూ ఉంటే ఆయన యెట్లా ఫీల్ అయ్యారో తెలీదు కానీ నాకు చాలా గమ్మత్తుగా ఉండేది. సరిగ్గా ఒక 45 రోజుల తరువాత హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు స్కాన్ చేసి ప్రొబ్లెమ్స్ ఏమీ లేవు అంతా సజావుగా ఉంది అన్నారు. వ్యవహారం అధికారికంగా నాన్న అందరికీ తెలిసే జరుగుతూ ఉండటంతో హెయిర్ కటింగ్ చెయ్యవలసిన అవసరం లేకపోవటంతో హెయిర్ పెరగటం మొదలయ్యింది. దానితో నెమ్మది నెమ్మది గా పోనీ టైల్స్ వేసుకోవటం మొదలుపెట్టాను. ఈ మధ్యలో నేను అన్ని రకాల డ్రెస్ లూ వేసుకోవటం అలవాటు చేసుకున్నాను. అమ్మ ప్రోత్సాహం కూడా ఉండటంతో నాకు జీవితం ఎంతో ఆనందదాయకం గా అనిపించసాగింది. ఆంటీ రోజూ ఫోన్ చేసి విషయాలు తెలుసుకొనేవారు. అశోక్ అయితే అమ్మ నిద్రపోయిన తరువాత స్కైప్ లో మాట్లాడేవాడు. మెయిల్స్ పంపేవాడు. నాకోసం ఆన్ లైన్ లో శారీస్, సల్వార్స్ బుక్ చేసే వాడు. ఎక్కడనుండి వచ్చాయని అమ్మ అడిగితే నేనే బుక్ చేసుకున్నా అని అబద్ధం ఆడేదాన్ని(?). కానీ అశోక్ నాతో మాట్లాడినప్పుడల్లా తనని మిస్ అవుతున్నానని బాధగా ఉండేది అదే సమయంలో తనతో మాట్లాడినపుడు నాలో స్త్రీత్వం మేలుకోనేది.

కొన్ని రోజులకి బ్రెస్ట్స్ పెరగటం మొదలైంది. హిప్స్ కూడా డాకర్ గారు చెప్పినట్లు సన్నపడిపోయాయి. డాక్టర్ గారు రొమ్ములు పెరుగుతున్నాయి కాబట్టి సపోర్టింగ్ కోసం బ్రా వాడమన్నారు .... ఆ సమయంలోనే మళ్ళీ ఏవిధమైన పశ్చాత్తాపాలూ (మగవాడిగానే ఉండిపోవాల్సిందేమో అనే) ఉండకుండా సైకలాజికాల్ కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు . ఒక 3 మంత్స్ తరువాత డాక్టర్ గారు నాన్నకి కబురు పెట్టమన్నారు. అట్లానే ఆంటీ కూడా వచ్చింది. డాక్టర్ గారు వేజీనా ప్లాస్టీ సర్జరీ కోసం డేట్ ఫిక్స్ చేశారు. నాన్న సర్జరీ కి కన్సెంట్ లెటర్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కూడా కట్టేశారు .... ఒక శనివారం ఉదయం సర్జరీ చేశారు .... మత్తు మందు ఇచ్చేసరికి నొప్పి తెలియలేదు కానీ స్పృహ వచ్చేసరికి భరించరాని బాధ. నాన్న, అమ్మ లు ఓదార్చేవారు. ఒక 10 డేస్ వరకు డైట్ లేదు ఓన్లీ ద్రవ పదార్దాలే1 యూరీన్ కి వెళ్ళాలంటే పెయిన్ వచ్చేసేది. తరువాత కొంచెం కొంచెం గా తగ్గిపోయింది. 20 డేస్ తరువాత సగం నానీ గా హాస్పిటల్ కి వెళ్ళిన నేను "లావణ్య" గా ఇంటికి వచ్చాను. నాన్న ఈలోపులో హెడ్ ఆఫీసులో మేనేజ్ చేసి బెంగుళూరు రాజాజీ నగర్ బ్రాంచ్ మేనేజర్ గా వచ్చేశారు. నాన్న కొత్త ఇల్లుకోసం అన్వేషణ మొదలుపెట్టారు. కానీ ఆంటీ కొన్ని రోజులు ఈ ఇంటిలోనే ఉండండి అన్నయ్యా! హాస్పిటల్ అన్నీ దగ్గరకదా అవసరమైతే అన్నీ కుదురుకున్నాక వెళ్లిపోవచ్చు అని బలవంత పెట్టడంతో ఆ ఇంట్లోనే ఉండిపోయాము! నాన్న నాతో నేషనల్ ఓపెన్ స్కూల్ లో ఇంటర్మీడియట్ పరీక్ష "లావణ్య" పేరుతో వ్రాయించారు. ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యాను. తరువాత నేను కొద్దికాలం చదివిన కాలేజీ లోనే బీ. ఎస్సీ. (న్యూట్రిషన్) కోర్స్ కి జాయిన్ అయ్యాను. కొంతకాలానికి నాన్న ఒక డీలక్స్ అపార్ట్ మెంట్ కొన్నారు బ్యాంకు లో లోన్ పెట్టి. మధ్యలో దీపక్ వచ్చాడు. నన్ను చూసి కాజువల్ గానే మూవ్ అయ్యాడు కాకపోతే "చెల్లీ" అనే క్రొత్తపిలుపు. అమ్మ వంటలూ, ఇల్లు సర్దటం అన్నీ నేర్పించింది. అశోక్ ట్రైనింగ్ అయ్యాక ఫిన్లాండ్ లో జాయిన్ అయ్యాడు.

నా డిగ్రీ కూడా పూర్తయిపోయింది. దగ్గరలోనే ఒక పిల్లల హాస్పిటల్ లో సరదాగా న్యూట్రిషనిస్ట్ గా జోన్ అయ్యాను. అట్లా నాలుగేళ్ళు గడిచిపోయాయి. ఇంట్లో అమ్మా, నాన్న నేను ఒకప్పుడు మగవాడిననే విషయమే మర్చిపోయారు. వీక్లీ బ్యూటీ పార్లర్ కి వెళ్లి నా అందానికి మెరుగులు దిద్దుకోవటం మొదలు పెట్టాను. మధ్య మధ్యలో ఆంటీ వైష్ణవిల సలహాలూ సూచనలూ ఉండనే ఉన్నాయి గా! కానీ ఎవర్నైనా జంటల్ని చూసినప్పుడు నా మనసులో ఒక బాధ మెదులుతూ ఉండేది. నాకూ ఒక తోడు ఉంటే బాగుండునని. అమ్మా నాన్నకు చెప్పాలని ఉండేది. కానీ నాకిప్పటికే వాళ్ళు ఇవ్వవలసిన దానికంటే చాలా ఎక్కువిచ్చారు ఇంకా వాళ్ళను బాధ పెట్టకూడదు అనుకున్నా. అట్లా ఒక 6 సంవత్సరాలు గడిచిపోయాయి. నా వయసు 24 సంవత్సరాలు అప్పుడు నా జీవితంలో ఒక ఊహించని సంఘటన జరిగింది.

332 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login