బెంగుళూరు అపోలో హాస్పిటల్ లో నన్ను ఎక్జామిన్ చేసిన డాక్టర్ గారి వివరాలు కనుక్కున్నారు నోట్ చేసుకొని "నథింగ్ టు వర్రీ" అంటూ ఆంటీ ని మర్నాడు ఫోన్ చెయ్యమని చెప్పారు .... ! అమ్మతో "ప్రసాద్ గారిని నాతో మాట్లాడమని చెప్పండి .... నేను మాట్లాడతా! కంగారు పడాల్సిన అవసరం లేదు .... అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి" అంటూ నన్ను బయటికి పంపి అమ్మతో, ఆంటీ తో ఒక 10 నిమిషాలు మాట్లాడారు! అమ్మ. ఆంటీ , నేను లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్ళాము ..... అక్కడ ఆంటీ "డాక్టర్ గారు నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నారు! ఇట్లాంటి సమయాల్లో టెన్షన్ తో సూసైడ్ అటెంప్ట్ చేస్తారు! సెక్సువల్ డిసార్డర్ ఉన్నవాళ్ళు. ఇది తన లైఫ్ కి సంబంధించిన విషయం. మనమేమన్నా తన అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నామా మనకు వ్యతిరేక ఫలితాలు రావచ్చు" కాబట్టి నేను ప్రసాద్ గారితో మాట్లాడతా అన్నారు" అని నాతో చెప్పారు!
ఈవెనింగ్ నాన్న రాగానే అమ్మ జరిగింది చెప్పింది! సరే నేను మాట్లాడతా! అని నా వైపు చూసి "ఏదో మామూలు పెయిన్ అయ్యి ఉంటుంది. కంగారు పడకు రా నానీ" అని సర్ది చెప్పారు! నాకు ఎక్కడో ఒక గిల్టీ ఫీలింగ్ నాన్న ను మోసం చేస్తున్నామేమో అని" అమ్మ తో అంటే "ఏది ఎలా జరగాలో భగవంతుడు చూసుకుంటాడు! నువ్వు ఎవరినీ మోసం చెయ్యట్లేదు. ఇది నీ మనసుకి సంబంధించిన విషయం! మీ ఆంటీ నాకు తోడు ఉంది కాబట్టి సరిపోయింది! చూద్దాం ఏం జరుగుతుందో అంటూ అనునయించింది!"
నెక్స్ట్ డే నాన్న బ్యాంకు కి సెలవు పెట్టి విజయవాడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. మా ముగ్గురికీ ఒకటే టెన్షన్ . నాన్న సాయంత్రం 4 గంటలకే వచ్చేసారు! ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు! అమ్మను పిలిచి బెడ్రూంలో చాలాసేపు డిస్కస్ చేసారు! తరువాత నన్ను పిలిచారు! "నానీ! నేనూ ఏదో చిన్న ప్రాబ్లం అనుకున్నా! అయితే ఏదో హర్మోనల్ ప్రాబ్లం అంటరా! నీకు ఉండాల్సిన మేల్ క్రోమోసోమ్స్ కంటే ఎక్కువ గా ఫిమేల్ క్రోమోసోమ్స్ ఉన్నాయట! అందుకే ఆడవాళ్ళకు మెన్సస్ నెలకోసారి వచ్చినప్పుడు చెడు రక్తం బయటకు వస్తుంది.... ఇక్కడ నీకు అవుట్ పుట్ లేదు కాబట్టి పెయిన్ వస్తుందట! అందుకే నీకు బాడీ మీద హెయిర్ గ్రోత్ అంతగా లేదు.... మీసాలు కూడా రావట్లేదు! ఇంకా ముందు బ్రెస్ట్స్ కూడా సైజు పెరిగిపోతాయి. ముందు ముందు బాడీ కి కూడా ఫిమేల్ షేప్ వచ్చేస్తుంది " అని చెప్పార్రా డాక్టర్ గారు! ఒక వేళ సెకండ్ ఒపీనియన్ కి వెళ్తే బెంగుళూరు అపోలో హాస్పిటల్ లో స్పెషలిస్ట్ ఉన్నారట! ఆయనకు చూపించమన్నారు! ఎలాగూ కాలేజీ కి వెళ్ళాలి కదా! ఎల్లుండి అమ్మానేనూ నీతో వస్తాం! డాక్టర్ గారు ఏమంటారో చూద్దాం! అని అమ్మ వైపు చూసి "దీపక్ కి కబురు పెట్టు వాడు ఎలాగూ మద్రాస్ వీసా ప్రాసెస్ కి వెళ్ళాలి అన్నాడు! వాడేమంటాడో వాడితో కూడా డిస్కస్ చెయ్యాలి ఇంపార్టెంట్ ఇష్యూ కదా" అన్నారు! అమ్మ సరేనంది. అమ్మ నాన్నతో "మనకు స్నేహితుల్లో ఆప్తులు ఎవరైనా ఉంటే రమేష్ గారి ఫ్యామిలీ యే కదా! వదినతో చెప్తే యెట్లా ఉంటుంది" అంది! నాన్న నెమ్మదిగా "చాలా చక్కగా సాగిపోతుంది సంసారం అంత ఈ ఒడిదుడుకులు ఏమిటో అంటూ సరే చెప్పు ఇట్లాంటి విషయాల్లో చెల్లాయ్ నీకంటే కొంచెం తెలివిగా ఉంటుంది.... మన గుట్టు బయట పెట్టే స్వభావం కూడా లేదు. వీలైతే రమేష్ ఎట్లాగూ ఉండడు కదా వైష్ణవికి దసరా వెకేషన్ కాబట్టి వాళ్ళిద్దరినీ రమ్మంటే బాగుంటుంది. ఎట్లాగూ జానకి తోబుట్టువుల ఇల్లే కదా అది!" అన్నారు. నాకయితే పట్టరాని సంతోషం ... ఆంటీ నా ప్రక్కన ఉంటే నాకేమి కావాలో ఆమెకు తెలిసినట్లు మా అమ్మకు కూడా తెలీదు! ఎట్లాగూ అపోలో డాక్టర్ గారితో ఆంటీ మాట్లాడింది కాబట్టి సమస్య ఉండదు ఆంటీ మాతో ఉంటే!
అమ్మ ఆంటీ కి ఫోన్ చేసింది "ఆంటీ ఊహించిందే కాబట్టి సరేనంది. నాన్న ఒక వారం లీవ్ పెట్టి అశోక్ నాన్న గారితో కూడా మాట్లాడి మొత్తానికి బెంగుళూరు వెళ్లాం! అప్పటికే దీపక్ వచ్చేసాడు! ఈవెనింగ్ అశోక్ కారులో అపోల్లోకి వెళ్ళాం ఆంటీ, అమ్మ, నాన్న, దీపక్ నేనూ! డాక్టర్ గారితో ముందే ఆంటీ మాట్లాడినట్లు ఉంది డాక్టర్ గారు సేం టెస్ట్స్ వ్రాసారు! ఆ తరువాత డాక్టర్ గారు నాన్నకు విజయవాడ డాక్టర్ గారు ఏం చెప్పారో అదే చెప్పారు! నాన్న సొల్యూషన్ ఏమైనా ఉందా అని అడిగారు! డాక్టర్ గారు "వక్షోజాలు పెరిగిపోతూ, నడుము సన్న బడుతూ, బాడీ షేప్స్ మారిపోతుంటే మీ అబ్బాయి కి ఒక రకమైన మెటల్ డిసార్డర్ వచ్చేస్తుంది! అటు మగగా కనపడలేడు! స్త్రీగా తయారవ్వాలనిపిస్తుంది .... కుటుంబానికీ, సమాజానికీ భయపడి స్త్రీ గా మారాలనే తన కోరిక బయట పెట్టలేక ఇటు తన ఆడతనాన్ని అంగీకరించలేని సమాజం లో బ్రతకాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది! కాబట్టి ముందు సైకలాజికల్ గా తనని స్ట్రాంగ్ గా ఉండేటట్లు చూడాలి! స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో తనని స్త్రీగా మార్చటం తప్ప మనం చెయ్యగలిగింది ఏమీ లేదు అని తేల్చేసారు! పైగా "ప్రపంచంలో మీరిక్కడికి వెళ్ళినా ఫలితమిదే... సొల్యూషన్ ఇదే.... ! మీరు నేను చూపిన సొల్యూషన్ కి ఓకే అంటే వుయ్ కెన్ స్టార్ట్ ది ట్రీట్మెంట్! నా అభిప్రాయమైతే ఒక నెలలో తన శరీరంలో మార్పులు కనపడతాయి" అన్నారు. నాన్న ముఖంలో నిరాశ.... దీపక్ అయితే ఏం చెయ్యాలో తెలీక అట్లా నిలుచున్నాడు! అందరిలోకీ ముందుగా తేరుకున్నది ఆంటీ నే! ఈ కథ అంతటికీ జగన్నాటక సూత్రధారి తనే కదా మరి! "అన్నయ్యా! ఇంటికి వెళ్లి ఆలోచిద్దాం పదండి! అంటూ అందర్నీ బయలుదేరతీసింది ఇంటికి వచ్చాక అమ్మ, ఆంటీ, నాన్న, దీపక్ నలుగురూ కలిసి ఇంటి టెర్రేస్ మీదికి వెళ్లి చాలా సేపు మాట్లాడుకున్నారు! ఏమో ఏమి మాట్లాడుకున్నారో తెలీదు కానీ నైట్ 10గంటలకి భోజనం చేసి పైకి వెళ్ళిన వాళ్ళు రాత్రి ఒంటి గంటకు క్రిందికి వచ్చారు! నేను అప్పటికి నిద్రపోయాను!
నెక్స్ట్ డే ఈవెనింగ్ దీపక్ చెన్నై వెళ్ళిపోయాడు. వాడు వెళ్తూ "నానీ! నీకేమీ భయం లేదు. ఏం కావాలన్నా నేను ఉన్నాను. అమ్మ నాన్న నిర్ణయమేదైనా మనకోసమే కదా! నువ్వు అనవసరం గా కంగారు పడకు. ముందు కౌన్సిలింగ్ కి వెళ్ళు .... అమ్మ నీతో పాటు ఉంటుంది .... నేను నీకెప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను! అంటూ కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు! నాన్న, అశోక్ వాడిని డ్రాప్ చెయ్యటానికి రైల్వే స్టేషన్ కి వెళ్లారు! వాడు వెళ్ళిన వెంటనే నేను ఆంటీ ని, అమ్మనో కావలించుకుని ముద్దులతో నింపేశాను. ఆంటీ "లావణ్యా! నీకెట్లా తెలుసు మీ డాడ్ ట్రీట్మెంట్ కి ఒప్పుకున్నారని" అడిగారు! "ఆంటీ దీపక్ కీ నాకూ ఉన్న వయసు తేడా వల్ల నాతో అంత ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ... అట్లాంటి వాడు ఏడుస్తూ అంత ప్రేమగా మాట్లాడాడంటేనే నాకు అర్ధం అయ్యిపోయింది" అన్నాను. ఆంటీ "మొత్తానికి నా కోడలు గడుసుదే" అంటూ మొట్టికాయ వేసారు!
నాన్న దీపక్ ని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసరికి ఎక్కడి వాళ్ళం అక్కడ గప్ చుప్. నాన్న నీతో మాట్లాడాలిరా నానీ అని పిలిచి ఏకాంతంగా కూర్చోపెట్టుకుని "జాగ్రత్తగా విను! నీకేమీ కాలేదు. కేవలం క్రోమోసోమ్ డెఫిషియన్సీ అంతే. రేపు నీ శరీరంలో మార్పులు కనపడ్డా నువ్వేమీ కంగారు పడకు! అమ్మ నీతో నీకు తోడు గా ఉంటుంది .... నీకేం కావాలన్నా తనను అడుగు! నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్ల కావాలని కోరుకున్నాను! తీరా మీ అమ్మ ప్రసవించాక నేను దేవుడిని తిట్టుకున్నాను! ఏమో ఆయన చేసిన పొరపాటుని మల్లె సరి చేసుకొవాలనుకున్నాడేమో! మనకు మన కుటుంబానికీ అత్యంత ఆప్తులు జానకీ ఆంటీ రమేష్ అంకుల్ వాళ్ళు! నీకేమీ సంకోచం అక్కరలేదు. జానకి కూడా చెప్పి వెళ్తాను! అమ్మనూ, నిన్నూ ఈ పది రోజులూ దసరా వెకేషన్ అయ్యేవరకూ కనిపెట్టుకుని ఉండమని! ఎట్లాగూ అశోక్ ఉన్నాడు కదా! రేపు డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ మొదలుపెట్టమని చెప్తాను! నీకు మేమంతా ఉన్నాము! కాలేజీ కి ఎప్పతివరకూ వెళ్లగలవో అప్పటివరకూ వెళ్ళు! నిన్నెవరూ ఏమీ అనరు! నువ్వు మాత్రం మాకు ముఖ్యం రా నానీ! అంటూ గాద్గధ స్వరంతో చెప్పేసరికి నాకు కూడా ఏడుపు వచ్చేసింది! నేను ఏడుస్తూ ఉంటే నాన్నేమో నాకు ఇష్టం లేక నా పరిస్థితికి బాధతో ఏడుస్తున్నానని అనుకుని అనునయించసాగారు.
తరువాతి రోజు హాస్పిటల్ కి వెళ్ళాము .... నాన్న, నేనూ ట్రీట్మెంట్ కి అభ్యంతరం లేదని స్టేట్మెంట్ మీద సంతకం పెట్టేశాం. డాక్టర్ గారు కొన్ని ఇంజేక్షన్స్, టాబ్లెట్స్ వ్రాసారు. సైకాలజికల్ కౌన్సిలింగ్ కి కూడా ప్రిఫర్ చేసారు! ఆ తరువాతి రోజు నాన్న నాకూ, అమ్మకూ జాగ్రత్తలు చెప్పి విజయవాడ ఫ్లైట్ కి వెళ్ళిపోయారు .....! ఇక అప్పటినుండి మా కుటుంబం లో అందరి పర్మిషన్స్ తో ప్రారంభమైంది నా ప్రయాణం "స్త్రీత్వం" అదే నండి "ఆడతనం" దిశ గా!
నాన్న వెళ్ళిపోయిన మరుసటి రోజు హాస్పిటల్ కి వెళ్ళాము ఆంటీ, నేను, అమ్మా! డాక్టర్ గారు నవ్వుతూ నన్ను. "హాయ్ యంగ్ లేడీ! హౌ ఆర్ యు?" ఇంకా పాంట్స్ షర్ట్స్ వేసుకుంటే ఎట్లా? అంటూ నవ్వుతూ పలకరించారు. ఆంటీ తో "ఈ రోజు నుండి నేను వ్రాసే మెడిసిన్స్ వాడండి .... హర్మోనల్ ఎఫెక్ట్స్ కోసం ఇస్తున్నాను! గ్రాడ్యువల్ గా బ్రెస్ట్స్ అవీ పెరుగుతూ ఉంటాయి .... హిప్స్ సన్నబడతాయి.... డైట్ కూడా వ్రాస్తున్నా .... జాగ్రత్త గా వాడండి. ఇంకా డ్రెస్ లు కూడా చేంజ్ చేసేయవచ్చు. నౌ హి ఈజ్ హాఫ్ లేడీ.. మేము వ్రాసే మెడిసిన్స్ ఒక రెండు నెలలు వాడవలసి ఉంటుంది. తరువాత వెజీనా ప్లాస్టీ, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అవీ చెయ్యాల్సి ఉంటుంది .... వాస్తవానికి ఈ ప్రాసెస్ మొదలు పెట్టే ముందు కౌన్సెలింగ్ చెయ్యవలసి ఉంటుంది. కానీ ఇంతకు ముందు వచ్చినప్పుడు జానకి గారు చెప్పిన విషయాలు, విజయవాడ డాక్టర్ గారు చెప్పిన విషయాలు టాలీ చేసుకున్న తరువాత కౌన్సెలింగ్ ప్రాసెస్ తన విషయంలో అక్కరలేదనుకున్నా! అయినా నిన్న వీళ్ళ ఫాదర్ దగ్గర నుండి కన్సెంట్ లెటర్ తీసుకున్నా. ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు" అంటూ అమ్మ తో చెప్పారు. అమ్మ డాక్టర్ గారి కి చెమర్చిన కళ్ళతో థాంక్స్ చెప్పబోయింది. అప్పుడు డాక్టర్ గారు "ఈ విషయంలో నేను చేసింది ఏమీ లేదు. అంతా మీ జానకి గారు, విజయవాడ డాక్టర్ గారు మీ వాడికి సారీ మీ అమ్మాయికి ఇచ్చిన మోరల్ సపోర్ట్ వల్ల ఏవిధమైన అవరోధాలూ, వివాదాలూ లేకుండా మీ హస్బెండ్, సన్ ని ఒప్పించగలిగాము. మీరేమైనా థాంక్స్ చెప్పాలనుకుంటే జానకి గారికి చెప్పుకోండి అంటూ ఆంటీ వైపు ప్రశంస గా చూసారు. మెడిసిన్స్ కొనుక్కుని ఇంటికి వచ్చేశాము.
Discussion (0)