“అయితే ఇకపై మిమ్ములను జననీ అని పిలుస్తాను. మీరు చెప్పిన విధంగానే నేను మన బృందాలను తీసుకుని ఆంధ్ర, కర్ణాటక విషయముల (ప్రదేశములలోని) వీలైనన్ని గ్రామాలలో ఈ కూచిపూడి నృత్య రీతులలో అభినయాలను పరిచయం చేసి వస్తాను. అన్నీచోట్లా ప్రదర్శనలిచ్చి వస్తాను. అయితే ఒక చిన్న ప్రార్థన. మీరు కూడా మాతో రండి. అలాగే నీను నూరు గ్రామములలో ప్రదర్శనలనిచ్చి వచ్చాకా నన్ను స్త్రీగా మార్చి వేయండి. ఈ స్తనభారం, పిరుదుల భారం, మధ్యలో మోయలేని సన్నని నడుము, మృదువైన చేతులతో నేను పురుషునిగా మనలేకున్నాను. అలాగే నిన్న మోహనాంగి సాన్నిహిత్యంలో నాకు ఎంతో సుఖం కలిగింది. ఆమెను నాతో తీసుకుని వెడతాను. ఎందుకో నాకు ఆమే నాకు పతి కాగలిగినది అని ఆలోచన. అందుకు మీ అనుగ్రహం కావాలి.” అని అడిగాడు కురంగి.
“నేను నీతో రావలసిన అవసరం ఉంది.. కారణం కాపాలికుడు, అతని గురువు ఘోర తామసికుడు నిన్ను విడిచి పెట్టరు. కానీ నేను ఇక్కడ చేయవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇక మోహన విషయంలో ఈ పరగణా పాలకుని కుమార్తె ఆమె. కనుక ఆమెను, ఆమె తండ్రిని పిలిచి మాట్లాడి చెబుతాను. అలాగే సిద్ధేంద్రుల ఆనతిని కూడా తీసుకుని ఈం చేయాలో నిర్ణయించుకుందాం.” అని చెప్పి ఆ పరగణా పాలకుడికి, అతని కూతురు మోహనాంగి కి కబురు పెట్టాడు. అలాగే సిద్ధేంద్రుల అనుమతి కోరాడు. సిద్ధేంద్రునికి జరిగిన విషయాలన్నీ తెలుసు. “నంద, యోగి పురుషుని గా ఉన్నా, స్త్రీగా ఉన్న వచ్చిన నష్టమేమీ లేదు. కనుక ఇక పై నువ్వు యోగినీ మాత నందిని గా నువ్వు ప్రసిద్ధి పొందుతావు. ఇక్కడ శ్రీశైల ప్రాంతం లోని గ్రామాలలో కూచిపూడి నృత్య ప్రదర్శన రీతులను పరిచయం చేయటానికి మీరు తిరిగి వచ్చేవరకూ నా శిష్యులలో రాఘవుని, ఆదిత్యుని ఉంచుతాను. నువ్వు కురంగితో వెళ్ళు. కాపాలికుని, అతని గురువును ఎదిరించ గల సామర్థ్యమును నువ్వు రాధాదేవి, భ్రమరాంబాదేవి ఉపాసన తో పొందుతావు. నీశక్తులన్నీ నీతోనే ఉంటాయి. అయితే నూరు గ్రామాల ప్రచారం తరువాతనే నీకు పురుషత్వం తిరిగి. అలాగే నువ్వు కురంగిని అక్కడినుంచి వచ్చిన తరువాతనే స్త్రీ గా మార్చు. మోహనాంగిని మోహనుడిగా మార్చు. ఇంతవరకు శ్రీకృష్ణ ఉద్యానవనంలో జీవనం గడుపుతున్న ఆ యువతులను తిరిగి యువకులుగా మార్చి కురంగి నాయకత్వంలో కూచిపూడి ప్రచారానికి పంపించు. కారణం కొంత కాలం వరకు కూచిపూడి నృత్యకళ పురుషుల ద్వారానే జరగాలి. శ్రీకృష్ణుడు మాత్రమే పరమ పురుషుడు. మిగిలినవారు ఎవరైనా ప్రకృతి స్వరూపిణులైన స్త్రీలే. కనుక ఈ పురుషులందరూ స్త్రీలే. మధురభక్తి ప్రచారం నృత్య రీతులలో జరగాలి” అని చెప్పాడు.
సిద్ధేంద్రుని అనుమతి తో నందయోగి తన పేరును యోగమాత నందిని గా మార్చుకున్నాడు. తండ్రితో కలిసి వచ్చిన మోహనాంగికి తాను పురుషునిగా మారుతున్న విషయం చాలా సంతోషాన్ని కలిగించింది. మోహనాంగి తండ్రి కూడా నా కుమార్తె కుమారునిగా మారుతోంది అంటే మీ అనుగ్రహం వల్ల పుత్ర సంతానం లేని నాకు వారసుడు లభించినట్లే. ఎంతో సంతోషం మాతా. కురంగి బృందం సంచారానికి కావాల్సిన ధన, సేవక, పరివార సహాయాన్ని నేను సమకూరుస్తాను ” అని సాష్టాంగ ప్రణామాలు చేశాడు.
మోహనాంగి తో నందిని నిన్నటి సంఘటనలో నీకు నామీద కూడా కోరిక పుట్టింది. మనిషికి ప్రేమ ఉండవచ్చు కాని కామం ఉండ కూడదు. ఇప్పుడు నేను నిన్ను పురుషునిగా చేస్తే నీవు నీ పురుష శక్తిని స్త్రీల పట్ల కామ వాంఛగా మార్చుకోకు. ఇంతవరకు నువ్వు స్వలింగ సంపర్క వైన స్త్రీ వి. ఇక పై నువ్వు పురుషునిగా మారాకా కురంగి రక్షణ చెయ్యి. నీకు ఈ ఏకాంతంలో ఒక రహస్యం చెబుతున్నాను. కురంగి కూడా నీలాగే పురుషుడే. కొన్ని అవసరాలకోసం స్త్రీ లాగా పెంచాను. మీరిరువురు ఈ శతగ్రామవ్రతం పూర్తి చేసుకుని వచ్చాకా కురంగిని స్త్రీగా మార్చి నీకు కానుక గా, భార్య గా ఇస్తాను. నీకు ఇప్పటికే యుద్ధ విద్యలన్నీ వచ్చు కనుక నీవంటి వీరుడు ఈ బృందంలో అవసరం. అయితే ఎక్కడా కురంగి పురుషుడు అన్న విషయాన్ని ప్రకటించకు.” అనిచెప్పింది నందిని.
మోహనాంగి అన్నింటికీ అలాగే అని వినయంగా తలూపింది. నంద యోగి నందినిగా మారినప్పుడు తనలో కలిగిన కామ వాంఛను నందిని తెలుసుకున్నది అని విని సిగ్గు పడింది. యోగులకు అసాధ్యం ఏమీ లేదు. అని తెలుసుకుంది. అలాగే కురంగి పురుషుడు అన్న విషయం తెలుసుకుని చాలా ఆశ్చర్య పోయింది. ఆ రహస్యాన్ని ఎక్కడా ప్రకటించను అని చెప్పింది.
తరువాత ఆమెను మోహనునిగా మార్చింది నందిని. అతనికి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేసి ఇక పై శివ పంచాక్షరీ జపం చేస్తే నీకు అనేక శక్తులు కూడా సిద్ధిస్తాయి. అని చెప్పింది. తన పురుష రూపానికి మోహనుడు ఎంతో ఆనందించాడు. అప్రయత్నంగానే మోహనుడి చెయ్యి తన నూనూగు మీసకట్టుపైకి వెళ్ళింది. మరో చెయ్యి తన నడుముకు ఉన్న ఒరలోని కత్తి పిడిపైకి వెళ్ళింది. మోహనుడి తండ్రికి పట్టలేని ఆనందం కలిగింది.
ఆ తరువాత నందిని శ్రీకృష్ణ ఉద్యాన వనానికి వెళ్ళి అక్కడ ఉన్న గోపికలను తిరిగి పురుషులుగా మారుస్తానంటే వారు ఒప్పుకోలేదు. మాకు ఇది శాపం లా లేదు. శ్రీకృష్ణ పాద సేవా భాగ్యం. మేము గోపికలుగానే ఉంటాము అన్నారు వాళ్ళంతా. అయితే నందిని అలా కాదు. మీరంతా ఈ నాట్య కళను ప్రచారం చేసేందుకు పురుషులుగా మారాలి అని ఒప్పించి పురుషులు గా మార్చింది.
ఇప్పుడు ఆ కూచిపూడి నాట్యకళా బృందానికి ధనశక్తి, జనశక్తి నిండుగా మెండుగా ఉన్నాయి. అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. (సశేషం)
Festival · Telugu
కూచిపూడి కురంగి .. .. (నాట్య మయూరి)
Completed
|
Part 4 of 7
|
0 Likes
Part 4
1540 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)